పాపం పడతి (6);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 క్షమయా ధరిత్రీ ఆంటారు కుల స్త్రీ గురించి చెప్పేటప్పుడు పెద్దలు చెప్పిన  చక్కటి సహజ  గుణం  భూదేవికి ఎంత సహనం ఉంటుందో  గృహిణికి అంత సహనం ఉంటుంది  కనుకనే ఇంటిని పరిపూర్ణంగా  తీర్చిదిద్దగలిగిన  సత్తా ప్రకృతి ఆమెకు ఇచ్చింది  ఆమె దానిని సద్వినియోగం చేసుకుంటుంది  భర్తను ఎంతో ఆప్యాయంగా చూస్తూ  ఏ క్షణానా అతనికి ఏ విధమైన  అవరోధాలు కలగజేయకుండా  భర్త చెప్పిన మాటలకు కట్టుబడి  వారు చెప్పినట్లుగానే నడుచుకుంటుంది. కనుక పతివ్రత అంటున్నారు.  పతివ్రత అంటే పతిని వ్రతముగా స్వీకరించినది భర్త చెప్పినట్లు చెప్పు చేతలలో నడిచే  ప్రవర్తన కలిగినది అని మన పెద్దవారు నిర్వచించారు  దానికి ఉదాహరణగా చెప్పవలసి వస్తే  కుంతీ దేవిని చెపుతారు. భర్త చెప్పినట్లుగా నడిచింది  ముగ్గురు పిల్లలకు  తల్లి అయింది. రామాయణంలో వాల్మీకి మహర్షి సీత ద్వారా  స్త్రీ నడవడిక ప్రవర్తన శీలాన్ని మానాన్ని  రక్షించుకునే పద్ధతి గురించి  చాలా చక్కగా చెప్పారు  కారణాంతరాల వల్ల  రావణాసురుడు తన చెల్లి శూర్పణఖకు ఇచ్చిన మాట  కోసం మహా పతివ్రత అని తెలిసి కూడా  సీతమ్మను చెరబట్టాడు  అతని శీలము కూడా గొప్పది కనుక  తన అంతఃపురంలో కాకుండా  ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే సీతమ్మను శోకమే తెలియనటువంటి అశోక వనంలో ఆమెను ఉండడానికి ఏర్పాటు చేశాడు. దాస దాసీ జనులతో పాటు  వేదాలను అధ్యయనం చేసిన విభీషణుని   కుమార్తె త్రి జటను  స్నేహంగా ఉంచి తన మంచితనాన్ని రుజువు చేసుకున్నాడు. సీతమ్మ కన్నీటి వల్ల లంకా నగరమే దగ్దమైపోయింది  స్త్రీ ఉసురు  తగలకుండా ఉంటుందా పాపాత్ములకు. ఆంధ్ర మహాభారతంలో  వ్యాసులవారు ద్రౌపది పాత్రను సృష్టించి  స్త్రీ లోకానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు  పంచభూతములకు  నిలయమైన ఐదుగురు పంచ పాండవులతో  సంసారం చేస్తూ  గృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ  అందరి మన్ననలను పొందింది  అనుకోని విపత్తు వచ్చి  ధర్మరాజు శకుని పాచికలకు బలి అవ్వడంతో  ద్రౌపతిని మహా పతివ్రతను కొప్పు పట్టి లాగి  తీసుకురావడం మహా పాపం. కొప్పు అంటే వేదం. ఆ  వేదాన్నే  అపహాస్యం చేసినట్లు లెక్క తానోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని  రారాజు  ఆమెను వివస్త్రగా చేయడానికి  ప్రయత్నించిన సందర్భంలో  ఆమె పెట్టిన కన్నీరు కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది  స్త్రీ తలచుకుంటే మహా ప్రళయాన్నీ సృష్టించగలదు  ఆశ్చర్యకరమైన శాంతినీ చేకూర్చగలదు అందుకే  గృహిణిని భూమాతతో పోల్చడం.


కామెంట్‌లు