సాధారణంగా పిచ్చి గీతలు అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు... పసి పిల్లలే కదూ...! ఎక్కడపడితే అక్కడ పిచ్చి గీతలు గీయడం వారికొక హాబీ అనే చెప్పాలి. చేతికి
పెన్సిల్ గానీ, పెన్ గానీ, క్రేయాన్స్ కానీ, స్కెచెస్ కానీ దొరికితే చాలు కళాకారుల మాదిరి ఫీల్ అయిపోతూ గోడలమీద, నేల మీద, ఎక్కడపడితే అక్కడ తెగ గీసేస్తూ ఉంటారు. మనం ఎంత చెప్పినా వినరు కాక వినరు. నిన్న మా ఇంటికి మా రిలేషన్స్ వచ్చారు వాళ్లతో పాటు ఒక బుడ్డోడు వాడికి ఓ నాలుగేళ్ళు ఉంటాయి. వాడితో ఆడాలని అని ఎంత ప్రయత్నించినా వాడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నా లాంగ్ నోట్ బుక్,పెన్ పక్కనే ఉంటే దాన్ని పట్టుకొని ఏదో గీయడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లాడు కదా అందులో చుట్టాలు కూడాను అని వదిలేసాను. కొద్దిసేపు అయ్యాక వచ్చి చూస్తే సగం బుక్ చింపేశాడు, మిగతా బుక్ అంతా పిచ్చి గీతలు గీసి పెట్టాడు. అరే బుక్కంతా ఏమిటిరా ఇలా గీసేసావ్ అని నేను అంటుండగానే వాళ్ళ అమ్మ వచ్చి వాడు అంతేనమ్మ వాడి
బుక్స్ అన్నిట్లో ఇదే పని చేస్తాడు. మళ్లీ కొత్త బుక్కులు కొనిస్తూ ఉండడం మా పనైపోయింది. చిన్నపిల్లలు ఏం తెలియదు కదా... ఏం చెప్తాం అంటూ గారాలకు పోయింది.
అవునండీ... వాడిప్పుడు ఇంకా ఎల్కేజీనే కదా వాడికి అప్పుడే నోట్ బుక్స్ ఎందుకు పలక, బలపం ఇస్తే సరిపోదూ అని
నేను చెప్పగానే లేదమ్మా వాళ్ళ స్కూల్లో అంతా నోట్ బుక్సే. స్లేట్, స్లేట్ పెన్సిల్ తెలియదు వాళ్లకు అంటూ నవ్వేసింది. కాస్ట్లీ స్కూల్స్ లో చేర్పించి కాస్ట్లీ ఐటమ్స్ ని పిల్లలకు కొనిస్తూ ఉంటే సరిపోతుందా? ఇలా అయితే ఆ పిల్లలకు వస్తువు పై జాగ్రత్త,
పనిపై శ్రద్ధ ఎలా ఉంటుంది చెప్పండి...? నోట్ బుక్స్ కొనివ్వడంలో తప్పులేదు కానీ లోకజ్ఞానం తెలియని పిల్లలకు ఇలాంటి వస్తువులు కొనిచ్చి వృధాగా డబ్బును వ్యర్థం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. పలక పై అక్షరాలు దిద్దించడం వల్ల
వారికి తెలియకుండానే ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయి. అది ఎలాగంటారా....! పలకపై కాస్తంత స్థలం మాత్రమే ఉంటుంది అందువల్ల కొన్ని అక్షరాలు మాత్రమే పడతాయి. దాంతో పిల్లలు వారి అవసరానికి తగ్గట్టు పెద్దవి రాయాలా చిన్నవి రాయాలా అని వారికి వారే ఒక అవగాహన లోకి వస్తారు అంతేనా ఒకవేళ తప్పు రాస్తే, అక్షరాన్ని చెరిపి రాయడం వల్ల వారి తప్పులు వారే సవరించుకుంటూ కాస్తంత జ్ఞానాన్ని పెంచుకునే వెసులుబాటు దొరుకుతుంది.
అదే ఈ నోట్ బుక్స్ లో అంటారా తప్పు పోయిందంటే ఆ పేపర్ చింపేసి మరో పేపర్లో రాసేయడమే. అందువల్ల వారిలో కేర్ లెస్ నెస్ పెరిగిపోతుంది. పెద్దయ్యాక
దీంతో చాలా బాధపడాల్సి వస్తుంది కనుక పిల్లలకు ఏ వస్తువులు ఉపయోగపడతాయో ఆలోచించి వారి కందించినట్లయితే వారి వికాసానికి దోహద పడిన వారమౌతాము అని చెప్పాను. అంతేగా మరి...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి