గుడ్డు హెల్త్ కి వెరీ వెరీ గుడ్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పుష్కలంగా అన్ని ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ లభించే ఏదైనా ఆహారం ఉంది అంటే అది కేవలం గుడ్డు మాత్రమే.
రోజు గుడ్డు తినడం వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. టీవీలో కూడా ఈ గుడ్డుకు సంబంధించిన అడ్వటైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. "రోజ్ ఖావో ఏక్ అండా" అంటూ సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రిటీస్ తో
ప్రచారం చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఈ గుడ్లను తప్పక తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ కె, జింక్, కాల్షియం, ప్రోటీన్స్, ఫోలేట్  అనేవి మెండుగా లభిస్తాయి. గుడ్డు తినడం వల్ల ఎముకలు, కండరాళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. కంటి చూపు సమస్యలు దరి చేరవు, బక్క పల్చగా ఉన్నవాళ్లు వెయిట్ గైన్ అవ్వడానికి ఈ ఎగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఎగ్ లో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ అనేవి ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. మెమరీ పవర్ పెరగడానికి కూడా ఎగ్ అనేది మంచి ఆహారం. ఇంత మంచి ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ లో భాగంగా చేయండి. రోజు పొద్దున్నే పిల్లలకు తినిపించండి. 
తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యమే ఈ ఎగ్ అనేది.కనుక రోజు మీరు తిని పిల్లలకు కూడా వారు ఈ రకంగా ఈ గుడ్డను తినడానికి ఇష్టపడతారో అదేవిధంగా ఏ ఆమ్లెట్టో, ఫ్రై నో, పొరుటో చేసి వారి నోటికి రుచికరంగా అందిస్తే
వారి ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఆటంకం కలుగదు. హైటెక్ సిటీస్ లో ఉంటాం కాబట్టి దొరకడం కష్టమే కానీ నాటు కోడిగుడ్లు దొరికినట్లైతే పిల్లలకు తప్పక తినిపించండి. మరి మీ పిల్లలకు ఈ అలవాటు తప్పక చేస్తారు కదూ...


కామెంట్‌లు