పాపం పడతి (7);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒకప్పటి కుటుంబ వ్యవస్థకు నేటి వ్యవస్థకు సంబంధం లేదు  సనాతనులు స్త్రీని బయటకు కనిపించేలా  రానివ్వలేదు  ఇంట్లోనే వారి పనులు వారు  ఆ కుటుంబానికి సంబంధించిన  పనులను అన్నిటిని నెరవేర్చడానికి  అందరి బాగోగులు చూడడానికి ఆమె  ఉపయోగపడేది  వామపక్ష  పాతులు పెరిగిన తర్వాత  సుందరయ్య గారి లాంటివారు  ఏ ఇంటికి వెళ్ళినా ముందు ఆ గృహిణిని పలకరించి ఏమ్మా ఎలా ఉన్నావు  ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లలందరూ చెప్పినట్లుగా మాట వింటున్నారా  అంటు పరామర్శించిన తరువాతనే ఆ ఇంటి పెద్దను కలవడం మాట్లాడడం  ఏమైనా కొత్త కొత్త విషయాలు ఉంటే దాని గురించి చర్చించడం ఒకరికొకరు వారి అభిప్రాయాలను మార్చుకుంటూ ఎలా చేస్తే బాగుంటుందో నిర్ణయాలు చేయడం చేసే పద్ధతి అమలయింది.
ఎప్పుడు ఈ పద్ధతి అమలయిందో  మిగిలిన పురుష జాతికి  ఆ పద్ధతి నచ్చి దానినే అనుసరిస్తూ వస్తున్నారు  వీరు కూడా  బంధువుల లేక స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు ముందు  స్త్రీలను పలకరించి బాగోగులు కూడా తెలుసుకొని ఆ తర్వాత  కార్యక్రమాలు ఉంటాయి. ఎప్పుడు స్త్రీకి  చదవాలన్న కోరిక ప్రారంభమైందో  జ్ఞానం కోసమే కాదు ధనార్చన కోసం కూడా  చదివితే బాగుంటుందని  మంచి మంచి ఉద్యోగాలకు కావలసిన అంశాలను ఎన్నుకొని చదవడం దానిలో కృతకృత్యులవుతున్నారు. ఇవాళ విమానాలు రైళ్లు  ఓడలు నడపడంతో పాటు  దేశాలను పరిపాలించగలిగే స్థితిలోకి  స్త్రీ  వచ్చింది  ఒక్కటి ఆలోచించండి  ఇందిరాగాంధీ (స్త్రీ) రాకముందు  కరువు కాటకాలతో ఇబ్బంది పడేవారు  ఆమె వచ్చిన మరుక్షణం చేసిన మొదటి పని ప్రోకూర్ చేయడం  సంవత్సరానికి సరిపడిన ధాన్యాన్ని నిల్వ ఉంచడం.
అంతవరకు పరిపాలించిన మగమహారాజులకు  ఈ ఆలోచన ఎందుకు రాలేదు  కనుక ఇంటిని  పాలించడంతోపాటు దేశాన్ని కూడా పాలించగలను అన్న ధైర్యాన్ని  సమాజానికి స్త్రీ కలుగ చేసి ముందంజ వేస్తోంది  ఇది ప్రతి ఒక్కరూ హర్షించదగిన విషయం  వాళ్లను ప్రత్యేకంగా వేరుగా చూడవలసిన అవసరం ఏముంది  వారు వీరి కుటుంబ సభ్యులు కాదా  ఈ కుటుంబంలో అక్క చెల్లి వదిన  మరదలు  లాంటి వాళ్లు కాదా  నీ చెల్లి ఉద్యోగం చేస్తుంటే నీకు ఎంత ఆనందంగా ఉంటుందో అక్కడ ఉన్నత స్థానంలో ఉండి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్న కార్యక్రమాలు చేస్తూ ఉంటే  నీకెంత గర్వంగా ఉంటుంది  అలాంటి మేధాసంపనులను మనం దూరం చేసుకుంటే సమాజం ఏమైపోతుందో అని  పెద్దలు ఆలోచించి సమాన హక్కులతో పాటు బాధ్యతలను కూడా అప్పగించడం మన అదృష్టం.


కామెంట్‌లు