పాపం పడతి (8);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒకరోజు సాయంత్రం నా  ఆత్మీయ స్నేహితురాలితో కలిసి బజారు వెళ్లి అక్కడ పక్కనే ఉన్న విపణి లోపలికి  వెళ్లి వద్దామని లోపలికి వెళ్లి  ప్రతి అంగటిని  చూసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడక ప్రారంభించాం  ప్రతి వ్యాపారి తన సరుకుల  ధరలను ఒక పట్టికగా రాసిన దానిని పరిశీలించుకుంటూ వెళుతున్నాం. కాయగూరల ధరలు ఆకాశంలో చుక్కలను అంటుతున్నాయని పత్రికలలో వస్తున్న మాటలు  అక్షరసత్యాలు అనిపించింది  చివరి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ  వండిన కూరలు  అమ్మే బండి కనిపించి  అక్కడికి వెళ్లి అన్నీ చూసి  వంకాయ లోనే నాలుగు రకాల పదార్థాలు చేశారు  మామూలు కూర చేశారు  గుత్తి వంకాయ ఒకటి బంగాళదుంపతో కలగలుపు మరొకటి  చివరిది స్టఫ్డ్ బ్రింజాల్  అవి చూసి ముచ్చటపడి వాటి ధరలు ఇంత అని అడిగితే
ఆ వ్యాపారి వరుసగా 15 రూపాయలు 20 రూపాయలు 22 రూపాయలు 25 రూపాయలు అని చెప్పాడు  అదేమిటి ఇదివరకు ఐదు రూపాయలే కదా ఎంత పెరిగిందా  అని అడిగేసరికి అతను సమాధానం చెప్పకుండా  రెండు  ఎత్తు బల్లలు తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోమని  తాను కింద కూర్చున్నాడు  చూడండి అమ్మా మీరు చెప్పినది అక్షరాలా నిజం ఈ ఒక్క స్టఫ్ డ్ బ్రింజాల్ చేయాలి అంటే  దీని వెనుక  దాదాపు 60, 70 మంది కృషి ఉంది. ముందు విత్తనాలను తయారు చేయాలి  వాటిలో మంచివి చెడ్డవి విభజించాలి  ఆ తర్వాత నాటి మొలక వచ్చిన తర్వాత దానికి ఎలాంటి చీడపీడలు రాకుండా  కంటికి  రెప్పలాగా కాచి రక్షించాలి  పంట వచ్చిన తర్వాత కూలీలను పెట్టి అవి కోయించి ఒక రాశిగా పోసి  దానిలో చచ్చులు, పుచ్చులు వేరు చేసి. ఆ పోగును  దళారీ ద్వారా అమ్మడం జరుగుతుంది.

అతను ఇక్కడకు వచ్చి ఒక గదిని అద్దెకు తీసుకొని కూరలు తూయడానికి కావలసిన సరంజామా మొత్తం  కొని తనకు సహాయకారిగా ఉండడానికి ఒక పొరిగాడిని పక్కన పెట్టుకొని వ్యాపారం ప్రారంభం చేస్తాం  నిజానికి మేము 15 రూపాయలకు అమ్మాలి అనుకున్నప్పుడు  20 రూపాయలు చెప్తాం. దానికి కారణం వచ్చిన ప్రతివారు  పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు వారు రాసిన ధర ఎంత ఉంటే అంత చెల్లించి వచ్చేస్తారు  మా దగ్గరకు వచ్చేటప్పటికి బేరాలు ప్రారంభమవుతాయి. నిజంగా మేం అమ్మ దలుచుకున్న 15 రూపాయలకే అడుగుతాడు అతను  అది వ్యాపారంలో కీటుకు అని చెప్పిన తర్వాత అతను అనుభవించి చెప్పిన ప్రతి అక్షరం నిజం అనిపించింది నాకు  నాకు కావలసిన సరుకులు తీసుకొని దానికి అతను చెప్పిన ధరతో పాటు అదనంగా మరో 50 రూపాయలు ఇవ్వబోతే  వద్దమ్మా నేను న్యాయంగానే తీసుకుంటున్నాను అనేసరికి జాలి పడి మరీ బలవంతంగా ఆయన జేబులో పెట్టాను  అప్పటికి కానీ నాకు తృప్తి అనిపించలేదు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం