నేటి పెండ్లి సందడి ;- తోడేటి సునీల దేవి - సెల్ ; 8522943662.

 పెండ్లి ఇంట్లో అడుగుపెట్టిన వేళ          
 పట్టు వస్త్రాల పెర పెరలు                  
 సెంట్ వాసనల పరిమళాలు            
చిన్నారి పొన్నారి చిలిపి చిందులు    
వరసైన వారి చిలిపి చూపులు                 
వారిని పసిగట్టే పెద్దవారి దొంగ చూపులు
 పిండి వంటల  గుభాళింపులు   
  ఆత్మీయుల కౌగిలింతలు                   
   పెళ్ళి పందిరితో పాటే 
మటుమాయమై పొయే ఆనందాలు                         
తెల్లారితే  ఉరుకులు పరుగుల జీవితాలు
కామెంట్‌లు
Shyamkumar chagal చెప్పారు…
మంచి భావ వ్యక్తీకరణ.
Unknown చెప్పారు…
నా ఈ 'నేటి పెళ్లి సందడి' కవిత ని నచ్చి తమ 'మొలక' అంతర్జాలపత్రిక లో ప్రచురించిన ప్రచురణకర్తలకు నా హృదయ పూర్వక వందనాలు - తోడేటి సునీలా దేవి