ఆకాశం చిల్లులు పడినట్టు
ధారాపాతంగా కన్నీరు కారుస్తోంది
నన్నుచూచి,ఒంటరివే, నీకెవరూ
లేరని,మనసు లేని మనుషులు
కన్న, మిన్నగా!!
ఆకారం రూపం లేని నీ శూన్యం మిన్న
అన్న భావం నాలో పొంగింది
పరవశాన! ఎందరుంటే ఏమి లాభం?
ఒక్క మాట మది మెచ్చిన మాట
మాట్లాడలేరు జీవులు!!
మాట ఉంది గాని మనసంతా తనపరమే
స్వార్థం మింగేస్తోంది జీవిని
మరి తోటి వారి బ్రతుకు ఎట్లా
ఆలోచించరా? అంతా స్వంతమేనా?
పక్క వారికి తావు లేదా?
పదుగురికోసం పరితాపం చెందితే
పరమాత్మ చెంత చేరుతాం!
పరిహాసాల పాలు కావద్దు
పరిణీతి చెందుదాం, ఒక్కసారి
ఆలోచిద్దాం అందరి కోసం
మనందరికై!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి