తెలివి లేని జీవితం తెగువరి కాదు
మనసు లేని జీవికి మనుగడ కొరవగు
మంచి ఆలోచించు మనుగడ పెంచు
మానవుని మస్తిష్కం తెలివితేట సంకలనం!
మదింపు లేని ఆలోచనలు ఆపదల పాలు
తెలివితేటలు ఒకరి సొత్తు కాదు
తెలిసి పయనించు వారు తెలివి పరులు
అతి తెలివి ఆచరించ అనర్థదాయకం!!
మంచి ఆలోచన మాననీయం, దైవ ప్రసాదం
అవమానించడం అతిశులభం ,
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు
అతివల్ల ఈర్ష్య ద్వేషాలు పుట్టుగొచ్చు!!!
నక్కజిత్తుల స్వభావం నరకం
మదగజము వోలె మసలుట
మాననీయం,మంచి , చెడుల
తలిసి హంస వలె మెలగడం
మహిని ఉత్తమం!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి