జీవన లక్ష్యం!;-డా. పి.వి.ఎల్ .సుబ్బారావు, 9441058797.
బాల పంచపది
=============
1.జీవితానికి సదా సదాశయం! 
    సాధనలో నిరంతర యత్నం!
    యత్నాన విజయసాఫల్యం!  
    వ్యక్తిజీవనం మరిసార్థకం!
   సదాశయం,
   జీవనలక్ష్యం ,కావాలి, రామా!

2. ఆశయం జనహితం కావాలి!
    ఆశయం ఎంపిక జరగాలి!
  అక్కడ జాగరూకత ఉండాలి! పొరపాటుకు తావు లేకుండాలి! సదాశయం,
 జీవనలక్ష్యం, కావాలి, రామా!

3. విద్యార్థికి ,
      ఉన్నత విద్య ఆశయం!
    నిరంతరం ,
        ఉత్తమ వర్తనం!
     ఏకాగ్రత,
           అత్యవసరం !
     మనోనిగ్రహం ,
             మరీ అవసరం!
సదాశయం ,
జీవనలక్ష్యం ,కావాలి, రామా!

4. నాయకులు నడిపించాలి!
    ప్రజలకు ఆసరా అవ్వాలి ! 
    ప్రజాక్షేమం కాంక్షించాలి!
   జీవితాన సేవ,
                ముఖ్యమవ్వాలి!
  సదాశయం,
 జీవనలక్ష్యం, కావాలి ,రామా!

5. దేశరక్షణ సైనిక సదాశయం!
   జనపోషణ కర్షక సదాశయం!
   ప్రగతి శ్రామిక సదాశయం!
   సద్గతి జీవన సదాశయుం!
   సదాశయం,
  జీవనలక్ష్యం, కావాలి, రామా!

6. మానవత్వం ,
        మన సదాశయం! 
   పచ్చదనం,
       ప్రజల సదాశయం !
    మంచి పెంచడం,
          మహదాశయం!
   దేశాన్ని ప్రేమించడం,
             నిజ ఆశయం!
సదాశయం ,
జీవనలక్ష్యం ,కావాలి, రామా! 
_________


కామెంట్‌లు