జాతకాల పిచ్చి( కథ);- ధనాశి ఉషారాణి కథా రచయిత్రి భాకరాపేట తిరుపతి జిల్లా--9441803495.....
 పుట్టెడు సంతానముతో  నిండిన కుటుంబమురా అబ్బీ ఒక్కే ఆడ కూతురురా ఎకరాలు కొద్ది మాగాణీ ఉందిరా అంటూ  జాతకాలు చూస్తూ సంబంధము తెచ్చాడు రంగయ్య మామ .ఇంటి నిండా మీసాలు మెలివేసే  చాకులాంటి కొడుకుల సంతానంతోను మురిసిపోతూ ఉంది అలివేలు 
కొత్త కోడలు కోసము ఎదురు చూస్తూ  ముంగిట్లో ముగ్గేసేటి కోడలు కోసము ఉత్సాహంతో తహతహలాడుతున్నావు లే అమ్మీ బలే జోరుగాను సిగ్గుపడుతున్నావుగా అంటూ పకపక నవ్వాడు రంగయ్య మామ. నీకు దిమ్మతిరిగే పిల్లను చూసానురా ముల్లంగోడ అంటూ వీరును తల నిమిరాడు అబ్బో ఫొటో ఐనా చూపు అంటూ నీళ్లు నమిలాడు  వీరు. ఇదిగో చూడబ్బీ పాత సినిమా హీరోయిన్లా ఉంది చూడు అంటూ పాతిక వేలు పచ్చ కాగితాలు కోసమై జాతకాలు కుదరకు పోయినా మసిచేసి మారేడుకాయ చేసాడు రంగయ్య .పెళ్లి ఘడియలు రానే వచ్చాయి గంపెడు ఆశలుతోను అత్తారింటిలో  పెళ్లి కూతురు అడుగు పెట్టింది లలిత అలా కాలము గడుస్తున్న కొద్ది  ఇంటి యజమానికి ఆయుస్సు రేఖ తగ్గుముఖం పట్టింది ఓ రాత్రి కాల సర్పము కాటేసి  అలివేలు భర్త పై లోకానికి చీటి తీసుకున్నాడు. ఊరు వాడ గొళ్లుమని ఓ వార్త గుప్పుమన్నది వీరు భార్య అడుగుపెట్టిన వేళరా  ఇంటి పెద్దదిక్కును కాటికి పంపేసింది నీ కోడలు అంటూ ముఖము ముందు పొడిచి పొడిచి అడగసాగారు అలివేలును. ఇంకేముంది కాళ్ళ పారాణి ఆరకముందే గుండె పగిలే మాటలతో రోదిస్తూ ఉంది కొత్త కోడలు లలిత.
   విధి రాతను ఎవ్వరు తప్పించగలరు  తెల్ల చీరతో ఎదురొస్తు ఉంటే ముఖము తిప్పుకుంటున్నారురా  వీరు అంటూ ఏడ్చింది అలివేలు .ఇలా చూస్తూ వుండగానే ఇద్దరు ఆడపిల్లలు  నట్టింట తిరుగుతుంటే  చూసి మురిసిపోయేది గంపెడు సంతోషం గుండెల్లో పొంగుకొస్తూ వీరు కేమో ఇంటి వారసుడు కావాలనే కోరికతో కలలు కనేవాడు అనుకున్నట్టుగా వీరు భార్య గర్భము దాల్చింది.చచ్చిన మాఅయ్య నా కొడుకుగా రాకపోడు అంటూ ఆలోచనతో మురిసిపోతున్నాడు వీరు.సావాస గాళ్లతో బయట కెళ్లిన వీరు ఇంటికి ఎంతసేపటికి రాకపోవడముతో   అలివేలు పరిగెత్తుకొంటూ ఊరంతా వెతికింది అంతలో ఓ నాగుపాము అడ్డగించి వీరుని కాటు వేసి పై లోకానికి పంపేసింది .ఇది చూసిన అలివేలుకు గుండెల్లో గునపము గుచ్చినట్టుగాను
ప్రాణo విలవిలలాడిపోయింది .కొత్త కోడలు వచ్చి ఇల్లు గుళ్లఅయిపోయ అని జనాలు మరోసారి విమర్శన హస్త్రాలు గుప్పించారు .నిండు కడుపుతో  ఉన్న లలిత ఇద్దరు ఆడబిడ్డల వంక చూసి కన్నీరు కట్టులుతెంచుకుంది .

గట్టిగా ఊపిరి పట్టి ఏడిస్తే కడుపులో బిడ్డకి అపాయము ఏమో అని కోడల్ని ఏడుపు అపుకో అని చెబుతూ తాను అపుకుంటూనే రోదిస్తూనే ఉంది అలివేలు.జీవితము నేర్పు గుణపాఠములతో రాజీపడలేక ఆటుపోటులతో గాలిలో దీపంలా నిలిచింది నెలలు నిండి తెల్ల బట్టలతో అలివేలు లలిత నిలిచారు .ఇది చూసి ఊరంతా  నష్టజాతకరాలు లలిత ఇల్లు  వల్లకాడు చేసిందని  శాపనార్థాలు పెట్టారు .గోడకు వేలాడుతున్న వీరు ఫొటోను చూసి నిండుగా కన్నీరు పెట్టుకుంటూ  గట్టిగా ఏడ్చేది వీరు భార్య.కొన్ని రోజులు తరువాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది  లలిత నా భర్త మరలా నా కడుపున పుట్టాడని కాసింత సంతోషము కలిగింది.అలా కాలము గడుస్తున్న కొద్ది   ఇంటిలో  ఇంకో దుర్వార్త విన్నది అలివేలు తన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అదివిని ఒక్కసారిగా ఊపిరి ఆగినట్టు ఐపోయింది  అలివేలుకు

ఇంటిల్లిపాటు తన కళ్ళ ముందే  కోల్పోయి తలకొరివి పెట్టే కొడుకులు చనిపోవడము చూసి  అలివేలు బ్రతుకు అగమ్యగోచరంగా మారిపోయింది.అందుకే గొడ్డు వచ్చినవేల బిడ్డోచ్చిన వేళ అంటారు కాబోలు అమాంతంగాను ఓ  కుటుంబము మగవాళ్ళని  కోల్పోవడముతోను నష్టజాతకరాలు లలిత అంటూ ముద్రవేశారు.ఇంటి మొదిలే లేకుండా పోయగా అంటూ ఇరుగు పొరుగు  చెవులు కొరుకుతూ మాయని ముద్రని  లలితపై వేశారు.వరుసగా అత్త ఇద్దరు కోడల్లు తెల్లచీరలు కట్టుకోని వస్తుంటే అందరూ వ్యంగ్యoగా మాటాడేవారు. సమాజపు ఛాoదస్సపు మాటలతో మనిషిని క్రుంగ తీస్తూ నరనరాల్లో పేరుకు పోయిన మూఢ నమ్మకాలకు ప్రతి మనిషి చిన్నబోవాలిసిందే అంటూ మగ దిక్కులేని ఆడదాన్ని చూస్తే కాటికి పోయే ముసలివాడు కామముతో కొట్టుకుంటాడు  అంటూ లోలోపల కృంగిపోయేది లలిత. అలివేలు నీ జాతకము మంచిది కాదు అంటూ  నిందిస్తూ గొడ్డును భాదినట్టు బాదగా  ఓ రోజు బాధ భరించలేక  మనస్తాపంతో లలిత ఉరితాడుకు నిండు ప్రాణము బలిపెట్టింది.  మనిషి మాట నానుడుగా మారి తీవ్ర మానసిక వత్తిడిని కలిగించే మరణాయుధములా ఉండకూడదని అందరూ గ్రహించాలి.జాతకాలతో మనిషి గమనాన్ని దేవుడి రాతను మార్చలేవని మనిషి గ్రహించాల్సిన జీవిత సత్యము.

కామెంట్‌లు