బందాగా శ్రోతలలో ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్న బందా కనక లింగేశ్వర రావు గారు దేశంలో ఉన్న మూడు మాధ్యమాలలో అంది వేసిన చేయి వారు ఏ మాధ్యమంలో ఉన్నా దాని మూలాలకు వెళ్లి అసలు విషయాలను తెలుసుకొని దాని పుట్టుపూర్వోత్తరాలతో అక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించి అనుసరించిన వ్యక్తి మొదట ఆయన జీవితం లాయర్ గా ప్రారంభమైనా ఆయన నిజమైన జీవితం ప్రపంచానికి ఆదర్శప్రాయమైన బళ్ళారి రాఘవాచార్యుల వారి శిష్యరికంతో ప్రారంభమైంది. బళ్లారి వారు ధరించని వేషాలు లేవు చారిత్రక జానపద సాంఘిక పద్ధతులను అన్నిటినీ ఆపోసన పట్టిన మహానుభావుడు ప్రత్యేకించి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీశం పాత్ర అంటే ఆయనకు విపరీతమైన మమకారం ఆ పాత్రకు జీవం పోసింది వారే అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.
బళ్లారి గారు రంగస్థల వేదికపై గిరీశం పాత్ర ధరించి నటిస్తున్నప్పుడు వారి ప్రతి కదలికను ప్రతి మాటను హావభావాలను, హాస్యోక్తులను వక్రోక్తులను అవగాహన చేసుకున్న ఏకైక వ్యక్తి బందా కనక లింగేశ్వర రావు గారు ఒకసారి కన్యాశుల్కం ఫలానా సమయంలో ఫలానా ప్రాంతంలో ఫలానా వేదికపై ప్రదర్శన ఉంటుందని ప్రకటించిన తరువాత అనివార్య కారణాలవల్ల అనారోగ్య రీత్యా బళ్లారి వారు ఆ పాత్ర నటించలేని స్థితిలో ఉన్నప్పుడు బందా గారు వారి దగ్గరికి వెళ్లి నాన్నగారూ నేనున్నాను మీ మాటను నిలబెడతాను నా మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా నాకు ఈ అవకాశం ఇవ్వండి మీకు ఏ విధమైన చెడ్డ పేరు తీసుకురాను అని మాట ఇచ్చిన తర్వాత వారి అంగీకారంతో వారి ఆశీస్సుల బలంతో ఆరోజు ఆ నాటకంలో గిరీశంగా బళ్ళారి వారితో పాటు నువ్వా నేనా అన్న భ్రమను కల్పించేలా నటించిన వారు బందా. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆనాడే గ్రహించి అంకిత భావంతో పనిచేసిన వారు కనక లింగేశ్వర రావు గారు.
తరువాత గురు శిష్యుల ప్రతిభను గ్రహించిన సినీ దర్శకులు రైతు బిడ్డలో గురువు బళ్ళారి రాఘవాచార్యుల వారికి జెమిని వారి బాలనాగమ్మ చిత్రంలో కార్యవర్ధి రాజు పాత్రకు ఎన్నికై సినీ రంగ ప్రవేశం చేశారు ఏ రంగంలో ఉన్నా గురు శిష్యులు ఇద్దరు ప్రథమంలోనే నిలిచేవారు. అటు రంగస్థలం కళామతల్లికి ఇటు సినీ రంగ మాతృత్వానికి వన్నెతెచ్చినవారు. ఆమంచర్ల గోపాల్ రావు గారి దర్శకత్వంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి బాలనాగమ్మ చిత్రానికి మంచి పేరు తీసుకొచ్చి గురువుగారి పేరు నిలబెట్టిన వారు బందా గారు. ఆమంచర్ల వారు విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్న రోజుల్లో బందా గారు. హాస్యాలాడుతుండేవాడు. వీడు ఆమంచర్ల గోపాల్ రావు నన్ను చెట్టు మీదనుంచి దూకేలా చేశాడు నిజానికి సినిమాలో చెట్టు ఎక్కి నిలబడినప్పుడు తిరిగి కిందపడినప్పుడు ఆ దృశ్యాన్ని రక్తి కట్టించగలగే శక్తి సమర్ధ్యాలు ఫోటోగ్రాఫర్ కు ఉన్నాయి. అయినా నన్ను దూకితే సహజత్వం ఉట్టిపడుతుంది అన్నమాట తో నన్ను కట్టిపడేశాడు అనేవారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి