జీవితంలో ఎవరికైనా ఒక మంచి పని చేసి గుర్తింపు పొందాలని నలుగురి చేత శెహభాష్ అనిపించుకోవాలని చేతనైనంత సహాయం చేయాలని ఆశపడుతూ ఉంటారు అయితే ముందు తను ఏం చేయదలుచుకున్నాడో దానిని ఎలా చేస్తే సాధించవచ్చో అనేది కూలంకషంగా తెలుసుకోకపోయినట్లయితే అతని ప్రయత్నం నిష్ప్రయోజనం మన పెద్దవారు అంటూ ఉంటారు ఆల్ఫాబెట్స్ తెలియని నీవు భాష మొత్తం నీ చేతిలో ఉండాలనుకుంటే ఎలా రా ఊహలలో తిరుగాడకు నిజ జీవితాన్ని అర్థం చేసుకో నీవు భాష నేర్చుకోవడానికి ముందు అ ఆ లు రావాలి కదా ఆ అక్షరాలే తెలియకుండా భాష మొత్తాన్ని గురించి ఆలోచిస్తే నీ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు కనుక నీ ప్రయోజనం నెరవేరాలి అంటే తెలిసిన వారి వద్ద విషయాన్ని సేకరించి వారు చెప్పిన పద్ధతిలో ముందుకు నడువు అప్పుడు విజయాన్ని సాధిస్తావని చెబుతారు.
అలాగే సుఖమయ జీవితాన్ని అనుభవించడానికి మార్గాలను అన్వేషించి డబ్బు సంపాదించడం తప్ప మరొక మార్గం లేదని తెలుసుకొని తన శక్తికి మించి కృషిచేసి ధనం సంపాదించిన తర్వాత నేను ఎంతో కష్టపడి సంపాదించిన ధనం కదా ఇది దానిని ఖర్చు చేస్తే తర్వాత ఏం కావాలి అన్న ఆలోచన వచ్చి ఆ ధనాన్ని మూటలు కట్టి దాచి పూజిస్తాడు తప్ప తన సొంత అవసరాలకు కూడా వాడే మనసు రాదు అసలు ధనం సంపాదించాలి అని అనుకోవడం దేనికి ఇంత కష్టపడి సాధించడం దాచుకోవడమే పరమార్థమైనప్పుడు అంత శ్రమ పడవలసిన అవసరం ఉందా అంటూ ఇలాంటి పిసినారులను గురించి వేమన ఎద్దేవా చేస్తూ రాసిన ఆటవెలది పద్యం ఎంతమంది మనస్తత్వాలను తెలిసి ఈ పద్యం రాసి ఉంటాడో వేమన. మన పెద్దలు ఒక సామెత చెబుతారు తనకు లేదని ఏడ్చే వాడికి ఒక కన్ను పోతుంది నాకు లేకుండా ఎదుటివారికి ఉన్నది అని ఏడ్చే వాడికి రెండు కళ్ళు పోతాయి అని ఎంత అనుభవంతో చెప్పిన మాట అది సహజంగా మానవ ప్రకృతి అసూయా ద్వేషాలతో ఎలా ఉంటుందో దాని పర్యవసానం ఎలా అనుభవించాలో వాళ్లకి తెలిసేలా కూలంకషంగా అధ్యయనం చేసి చెప్పారు వేమన. ఎదుటివారికి ఏదో మేలు జరిగిపోయిందని తనకు జరగలేదని అసూయతో కుంగి కృషించిపోకుండా అతనికి సంబంధించిన విషయాలను గురించి ఆలోచించకుండా తను చేయవలసిన కార్యాలను గురించి ఆలోచించుకుంటూ పోతే ఇలాంటి అసూయా ద్వేషాలకు ఆస్కారం ఉండదు. ఈ తనువు సక్రమంగా ఉండాలంటే ప్రశాంత చిత్తులై ఆలోచించండి అని సలహా ఇవ్వడం కోసం ఈ పద్యం మీరు చదవండి.
"అక్షరంబెరుగని యాచారమది యేల
తాను దినని యట్టి ధనమదేలా నొరుల మేలు చూచి యోర్వలేని తనువేల"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి