ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తన తల్లి పైన, భాష పైన వేషధారణ పైన తన శరీరములోని అవయము లపైన ప్రేమ పెంచుకోని వ్యక్తి మనకు కనిపించడు ఎప్పుడైతే వ్యామోహాన్ని పెంచుకున్నారో దాని పైన మోజు పె రుగుతుంది దానికి సుఖాలను అందించాలని ఆ ఇంద్రియాలు ఏది కోరితే దానిని అందించాలని, అనుభవించాలని అనిపించడం సహజం. తన కాయం పైన తనకు ప్రేమ లేని వ్యక్తి తన జీవితం వ్యర్థం అనుకుంటారు. శారీరక సుఖాలకు అలవాటు పడి ఏది చేయాలనుకుంటే అది చేస్తూ విచ్చలవిడిగా తిరిగే మనిషికి తన ఇంద్రియములను సుఖపెట్టడమే ధ్యేయంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అది చేయడం వల్ల తనకు మానసిక ఆనందం కలుగుతుంది దానికి అలవాటు పడిన తర్వాత వేరే విషయాలను గురించి ఆలోచన చేయడు. అతని జీవితంలో ఏదైనా సంఘటన చోటుచేసుకుని లేదు స్నేహితుల వల్ల ఏదైనా మాటల సందర్భాల్లో త్రిమూర్తులను గురించి మన దేవతలను గురించి వారిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం మన ఋషులు చేస్తున్న ప్రయత్నాన్ని గురించి విన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచన ప్రారంభమవుతుంది ఎప్పుడైతే అది తన మెదడులో బీజంగా ప్రారంభమైందో దానిని గురించి ఆలోచిస్తూ దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ శారీరకంగా తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడు. దానికి కారణం ఒక రకం స్నేహితుల వల్ల విషయం తెలుసుకున్నాడు కానీ దానిని ఎలా సాధించాలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అడగాలన్న ఆలోచన కూడా రాదు కారణం అతని అమాయకత్వం.
అయితే అతను తెలుసుకోవలసిన విషయం అతను వ్యక్తిగతంగా ఏ ఇంద్రియాలను, ప్రేమించి దానికోసం దాని సుఖం కోసం ప్రయత్నం చేసిన సమయంలో ఈ విషయాల గురించి ఆలోచన చేయలేదు కనుక ఎవరో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కలిసి ఎలా ప్రారంభించి ఎలా పెంచాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను చెప్పే విషయం ముందు నీ ఇంద్రియములను మీ అధీనంలో ఉంచుకో అవి నీ అధీనములోనికి వచ్చిన తరువాత శివ తత్వం ఏమిటో నీకు బోధపడుతుంది అంతే తప్ప ఇంద్రియ వ్యామోహం లో ఉంటే శివుని వెతకడం ఈ జన్మలో సాధ్యం కాదు అని వారి ఉపదేశం అలా చెప్పిన వారి మాటలను విని దానిని కార్యరూపంలో
చూపించినట్లయితే తప్పకుండా శివుని దర్శనం కలుగుతుంది అని వేమన చెప్తున్నాడు. ఆ పద్యాన్ని వినండి కాదు చదవండి.
"ఇంద్రియముల చేత నెక్కుందు చుండెడు
వెర్రి మనుజుడెళ్ల వెదకు శివుని ఇంద్రియములదోసి యిసుని జూడరా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి