ఈ భూమి మీద ఏ జీవి అయినా బ్రతకడానికి ఆహార, నిద్రామైధునములు సరిపోతాయా? ఆహారం లేకుండా కొన్ని రోజులైనా ఉండవచ్చు తప్ప నీరు లేకుండా మనం బ్రతకగలమా? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఏమవుతుంది. మంచానపడి తన పనులు తాను చేసుకోలేని దుస్థితిలో ఇతరుల సహాయం కోసం ఎదురుచూసే మనిషి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించవచ్చు కదా. అలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తి పైన లేదా? సనాతనులు చెప్పిన పద్ధతి ప్రకారం నియమనిష్టలతో జీవితాన్ని గడిపిన వాడు ఆహార విహారాలలో మితంగా ఉన్నవాడు ఎందుకు అనారోగ్య పాలవుతాడు. ఏదైనా మానవుని చేతిలోనే ఉన్నది కదా జాగ్రత్త. ఈ ప్రపంచ జీవరాశికి సమస్తాన్ని అందించినది ప్రకృతి అనుకుంటే దానిని సృష్టించినది బ్రహ్మ అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ విషయాన్ని కొంతమంది సృష్టికర్త సృష్టించిన ప్రతి పదార్థం అర్థవంతమైనది ఆరోగ్యకరమైనది, అవసరమైనది కూడా. అనవసరమైన ఏ వస్తువు మనకు కనిపించదు. ప్రతి పదార్థానికి ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది అది మనకు తెలియకపోవచ్చు. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఓడలో తిరుగాడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్న ప్రయాణికుడు అతనికి ఆకలి దప్పులు కలిగినప్పుడు ఆ సముద్రంలో నీరు తాగాల్సి వస్తుంది కానీ ప్రకృతి దానికి ఉప్పును కలిపి తాగడానికి వీలు లేకుండా చేసింది కారణం అంత వేగంగా వెళుతున్నఓడ బయటకు వచ్చినప్పుడు అతను సముద్రంలో పడిపోయి మరణించే అవకాశం ఉంది కనుక. ఆ వనరును కల్పించింది ప్రకృతి అని చెబుతారు మన పెద్దలు. జీవితంలో ధనవంతులు తక్కువ బీదలు ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలుసు. ధనికులు ఎంత ఎక్కువ బంగారాన్ని దాచుకున్నట్లయితే అంత తృప్తి పడినట్లుగా భావిస్తారు ఆ వస్తువుపై ఉన్న మోజు వారిని ఎలా తయారు చేస్తుంది. అలాంటి వారికి ప్రకృతి ఇచ్చిన సహజ గుణం ఏమిటో తెలుసునా పిసినారితనం అతను ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న కోరిక ఉంటుంది తప్ప దీనిని సమాజానికి బీదవారికి అందిచాలన్న ఆలోచన రాదు కారణం దానిమీద మమకారం ఆ గుణం తన సొంతం అనుకుంటాడు కానీ ప్రకృతి ద్వారా బ్రహ్మ అతనికి ఇచ్చిన వరం అని భావించడు అందుకే ప్రకృతిలో బ్రహ్మ సృష్టించిన ప్రతి పదార్థానికి ప్రతి గుణానికి అర్థం ఉన్నది అయితే దానిని సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు అని తీర్మానిస్తున్నాడు వేమన ఆ పద్యం మీకోసం.
"ఉదధి లోన ఉప్పులుగా
జేసి పసిడి గల్గువాని పిసినిజేసె
బ్రహ్మ దేవుచేత పదడైన చేతరా..."
"ఉదధి లోన ఉప్పులుగా
జేసి పసిడి గల్గువాని పిసినిజేసె
బ్రహ్మ దేవుచేత పదడైన చేతరా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి