చూసి...నేర్చుకుంటారు పిల్లలు శ్రద్దనే చూపాలి పెద్దలు... !
కనిపంచేవి - వినిపించేవి...
పిల్లల మనసు దోచుకుంటాయి
అనుకరించి - అనుసరించే...
తత్వమే వారిది... !!
అదిగో...అటుచూడండి....
ఆ బాబును !
వాడు రాత్రి చూసినసినిమాలో రాకుమారుని వలే....,
అమ్మ చీరను, కిరీటంలా
. తలకు చుట్టుకుని....,
కొండ చీపురు పుల్లనే...
కత్తిలా దోపుకుని....,
ఎలా పోజు కొడుతున్నాడో !
ఇదిగో.... ఇటు చూడండీ...
సినిమాలో పాటలకు...
అచ్చం ఆ హీరోయిన్ల లా....
ఈ చిన్నారులు ఇస్తున్న...
డాన్స్ పోజులు... !!
అర్ధమైన - భావమైనతెలియని
ఆ వయసులో.... !
అది మంచో - చెడో...తెలిసి కొనకయే,అనుకరించు ఆ తీరు
అభం - శుభం తెలియని
ఆ చిన్నారులు చెడిపోతే....
బాధ్యులము... పెద్దలమే !
అందుకే.....,
పిల్లల పట్ల పెద్దలు...
శ్రద్ద వహించండి !
చెడును వారి దరికి....
. చేరనీయకండి.... !!
చూసి నేర్చుకుంటారు పిల్లలు !
శ్రద్దనే చూపాలి పెద్దలు.. !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి