అలరించిన బాలల సభ
  నిన్నటి రోజున (శనివారం)మా పాఠశాలలో జరిగిన బాలల సభ ఆద్యంతం ఆకట్టుకున్నది.
     ఆరవ తరగతి విద్యార్థి శ్రీకాంత్ పాడిన తల్లీబిడ్డల అనుబంధాన్ని తెలిపే పాటతో సభ ప్రారంభం అయినది.,ఏడవ తరగతి విద్యార్థి దీక్షిత పొడుపు కథలు , పదవతరగతి విద్యార్థిని చందన చెప్పిన పల్లె కవిత, రాంచరణ్ చెప్పిన శతక పద్యాలు, ఉదయశ్రీ చెప్పిన పోషకాహార విలువలు,రిజ్వాన చెప్పిన ఏకాక్షర వాక్యాలు ఆకట్టుకున్నాయి.
     ఇక ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ ఎనిమిదవ తరగతి విద్యార్థులు అంజివర్ధన్, దుర్గాప్రసాద్ సహజసిద్ధమైన ప్రతిభతో ప్రదర్శించిన జోకర్ పొట్టోళ్ళ వేషధారణ విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆనంద సంద్రంలో ఓలలాడించింది.
     వీరితో పాటు క్లిష్టమైన పదాలతో అల్లిన పాటను ఆనందంగా ఆలపించిన సంఘవి, అన్నదమ్ములతో ఆడబిడ్డకు గల అనుబంధాన్ని తెలిపే పాటను ఆలపించిన ఇద్దరు స్పందనలు, కోలాటంలో మురిపించిన శృతి బృందము, యూట్యూబ్ గురువుగా నేర్చుకున్న సానియా,రిజ్వానల నృత్యము,భూమేశ్, లోహిత్ రెడ్డిల చిత్రలేఖనం,చక్కనైన పూలతోట అనే దేశభక్తి గీతాన్ని ఆలపించిన భూమిక,మంచి అలవాట్లు అనే బాలగేయం ఆలపించిన రాంచరణ్, సైన్స్ విశేషాలు తెలిపిన శ్రావ్య,కొంరంభీముడో పాటతో ప్రతిభ చూపిన శశికాంత్, బాలకార్మికుల వెతలను తెలిపే పాటతో అందరినీ కదిలించిన లోహిత్, బ్యాండ్ ఎన్ని రకాలుగా మోగించవచ్చో చూపిన శ్రీకాంత్, అంజి, సందేశాత్మక కథలతో అందరినీ ఆలోచింపజేసిన సందీప్, కార్తీక్, చక్కటి వ్యాఖ్యానంతో సభను నిర్వహించిన సంఘవి, సానియా ప్రత్యేకంగా నిలిచారు.
   జి.ప్ర.ప.ఉ.పాఠశాల..నీర్మాల
మం.దేవరుప్పుల
జిల్లా.జనగామ


కామెంట్‌లు