రదీఫ్ : చినుకమ్మ ;-చంద్రకళ యలమర్తి
మిశ్రగతి 6565
*************
చిటపటమని జల్లులుగ
కురిసిందీ చినుకమ్మ 
చిరుగాలితొ వనమంత
తడిపిందీ చినుకమ్మ 

పుడమితల్లి పులకించి 
విత్తులన్ని మొలకెత్తె
మట్టివాసన కమ్మగా
తెచ్చిందీ చినుకమ్మ 

ఓ చినుకూ దూరాన
సంద్రములో  కలిసినది 
ముచ్చటైన ముత్యమై 
మెరిసిందీ చినుకమ్మ 

 కాగితాల పడవలతొ 
చిన్నారులు కేరింత
పడుచువారి ఊహలను 
తాకిందీ చినుకమ్మ 

మబ్బులన్ని కరుగుతూ  
చందురునీ ముద్దాడె                     
 వరదనీట సంద్రమై 
 పొంగిందీ చినుకమ్మ 

**


కామెంట్‌లు