జింక! అచ్యుతుని రాజ్యశ్రీ

 పూర్వం కథలు జంతువులచే నడిపించేవారు.ఏప్రాణికీ హాని చేయరాదని అలాచేస్తే మనకు ఆజన్మ వచ్చి అలాబాధలు పడతామని చెప్పే కథ ఇది.
కాశీపురరాజు హఠాత్తుగా చూపు కోల్పోయాడు.వైద్యుల ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు ఐనాయి.రాకుమార్తె వ్యవహారాలు చూస్తోంది. ఆరోజు తండ్రితో తోటలో తిరుగుతూ ఉన్న ఆమె దగ్గరకు ఓజింక వచ్చి అంది"రాజా!మీకు నేను చూపు తెప్పిస్తాను.కానీ ఈమెను నాకిచ్చి పెళ్లి చేయాలి." తండ్రి తటపటాయిస్తుంటే ఆమె అంది"అలాగే!" అని. ఆమూల ఓచెట్టు మెరుస్తున్న ఆకులతో ఉంది. దాని ఆకులు కోసి నలిపి కంటిపై రుద్దడం ఆలస్యం  వెంటనే చూపు వస్తుంది. " రాకుమారి అలాగే చేయటం తండ్రికి  దృష్టి రావటంతో అన్న మాట ప్రకారం అక్కడ ఉన్న దేవుడి విగ్రహం ముందు జింక మెడలో పూలహారం వేసింది. తన శయ్యా గృహంలో జింకను పట్టు పరుపు పై పడుకోబెట్టింది. అర్ధ రాత్రి వేళ  "రాకుమారీ"ఎవరిదో మగకంఠం వినపడటంతో ఉలిక్కిపడి లేచింది. పరుపుపై అందాల రాకుమారుడు. "నేను వైశాలి రాకుమారుడిని.నాతల్లితండ్రులు చనిపోగానే నాచిన్నాన్న గద్దెఎక్కి నన్ను అడవులపాలు చేశాడు. ఓముని ఆశ్రమం లో జింక పిల్లలను సతాయిస్తుంటే ఆయన నన్ను శపించాడు. మానవ కన్యను పెళ్లాడాక  శాపవిముక్తి కలుగుతుంది అని చెప్పాడు "అనగానే ఆమె  తన అదృష్టంకి మురిసిపోయింది. రాజు అల్లుడికి పట్టాభిషేకం చేసి తపస్సుచేసుకుంటూ తోటలో గడపసాగాడు. ఇలాంటి కథలు అసహజంగా అనిపిస్తాయి.కానీ లోతుగా ఆలోచిస్తే అంతటి రాజులకే తప్పలేదు కష్టాలు మనమెంత అనిపిస్తుంది.🌹
కామెంట్‌లు