రైతే రాజు!! ప్రతాప్ కౌటిళ్యా
కాలం గురించి మాట్లాడమంటే
వానాకాలం
శీతాకాలం
ఎండాకాలం గురించి మాట్లాడడం కాదు!!

కాలం గురించి మాట్లాడమంటే
పోయిన కాలం
వచ్చేకాలం
పోతున్న కాలం గురించి మాట్లాడటం కాదు!

కాలం గురించి మాట్లాడమంటే
అన్వాయుధాల గురించి
యుద్దాల గురించి
చరిత్ర గురించి మాట్లాడడం కాదు!!?

కాలం గురించి మాట్లాడమంటే
కాలాన్ని గుణంగా కలిగిన
కలియుగ దేవుడు రైతు గురించి 
మాట్లాడడం!!

అన్నం గురించి మాట్లాడడం
అన్నాన్ని అన్వాయిదంగా మార్చిన
అన్నదాత గురించి మాట్లాడడం!!

అందరి దగ్గర
అణ్వాయుధాలున్నవీ కానీ
అతని దగ్గర అన్నం ఆయుధాలు ఉన్నాయి!!

అతని ఆయుధం నాగలి
అతని భూమి యుద్ధభూమి!!
భూమ్యాకాశాల్ని దున్నే
దరిద్రపుత్రుడు అతడు!!

అతని ఆయుధం కత్తి కాదు
అతని ఆయుధం విత్తనం!!
ఆకాశమంత ఎత్తు ఎదిగిన
విత్తనం రైతు!!?

ఆకలి అమ్మలు తీరుస్తారు
అమ్మలా లోకానికి అన్నం పెట్టేవాడు రైతు!!

కులాలు రాజ్యానేలాయి
మతాలు రాజ్యాన్నేలాయి
ఇప్పుడు వృత్తి రాజ్యమేలాలీ!!?

కాలం గురించి మాట్లాడమంటే
రాజు గురించి మాట్లాడడం
రైతే రాజు అవడం గురించి మాట్లాడడం!?

భారత రాష్ట్రీయ సమితి తరపున తొలి రైతు చైర్మన్ ను నియమించిన సందర్భంగా కెసిఆర్ ను అభినందిస్తూ
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు