రకరకాల రంగులు
అందాల భువిలో......
అడుగుకో రంగు
అన్నీ అందమైనవే
విహంగ వీక్షణం చేస్తే
రంగుల అమరిక
ఇంకా అందంగా అనిపిస్తుంది.
పసిపాపాయి
పాలు మీద పోసుకున్నట్టు
మంచుకొండలూ....
గడపకు రాయాలని
తెచ్చిన పసుపు గిన్నె ఒలికి
ముగ్గంతా పసుపు
నిండినట్టు పసుపు పువ్వులూ..
చిన్న పాప కట్ఠుకున్న
అమ్మ పచ్చని చీర
పదే పదే సర్దుకుంటున్నట్టు
అనిపించే ... పచ్చదనమూ..
మాస్టారి పాఠం బుద్దిగా
వింటున్న పిల్లల్లా
కదలకుండా పైకి చూస్తున్న
చెట్లూ...
స్వర్గంలో ఇంతందం
ఉంటుందా? అనిపించే
ప్రకృతి రమణీయత
మనసును దోచే దృశ్యమాలిక
కన్నుల ముందు కనపడుతుంటే
మధురభావాల సుమాల మాలలు
మల్లె మరువం సంపెంగ కలిసిన
కదంబమాలలై మనసును
పరిమళింప చేసే
అందమైన ఉదయాన
అందరికీ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి