చప్పట్లు ముచ్చట్లు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

చప్పట్లు 
కొట్టాలనిపిస్తుంది
ముచ్చట్లు 
చెప్పాలనిపిస్తుంది

కళ్ళుతెరచి
చూడాలనిపిస్తుంది
ఓళ్ళుమరచి
మురువాలనిపిస్తుంది

చెవులుతెరచి
వినాలనిపిస్తుంది
ఆనందములోమునిగి
తేలాలనిపిస్తుంది

మనసువిప్పి
మాట్లాడాలనిపిస్తుంది
మదులుతట్టి
మురిపించాలనిపిస్తుంది

కాళ్ళను 
కదిలించాలనిపిస్తుంది
పూలను
తోటలోచూడాలనిపిస్తుంది

చేతులను
కలపాలనిపిస్తుంది
స్నేహాలను
పెంచుకోవాలనిపిస్తుంది

కవితలువ్రాసి
పఠించాలనిపిస్తుంది
శ్రోతలమెప్పించి
పొంగిపోవాలనిపిస్తుంది

పదాలు
ప్రయోగించాలనిపిస్తుంది
ప్రాసలు
పొసగాలనిపిస్తుంది

అర్ధాలు
వెల్లడించాలనిపిస్తుంది
భావాలు
బయటపెట్టాలనిపిస్తుంది

కవనం
చేయాలనిపిస్తుంది
కుతూహలం
కలిగించాలనిపిస్తుంది

కవిత్వాన్ని
పండించలానిపిస్తుంది
సాహిత్యాన్ని
సుసంపన్నంచేయాలనిపిస్తుంది

చేతులు కలుపుతారా
వెన్నును తడతారా
ప్రేరణం కలిగిస్తారా
సాయం చేస్తారా

కామెంట్‌లు