సుప్రభాత కవిత ; -బృంద
పరుగులు  తీసే నీటికి
దూరాన ఉన్న
కడలి పిలుపు వినపడుతోందా??

నీరు నిండిన మబ్బులకు
చల్లగాలితో కబురంపిన
శిఖరాల  ఆహ్వానం అందినదా??

కిరణాల స్పర్శకై  
తపించులోయల నిరీక్షణ 
తొలివేకువతో తీరేనా?

పడమట  దాగిన దారిదీపం
చీకటిని చీలుస్తూ
తూర్పున తేలేనా??

రాబోయే ప్రతినిమిషం
తెలియని అయోమయం
గడచిన  ప్రతిక్షణం 
చేయి జారిన గతం

సమస్యలు కొత్తవైనా
సాగించాలి పోరాటం
అయుధం లేకపోయినా
పరిస్థితులతో  యుధ్దం

జీవితం అనంత పయనం
గమనమే మన కర్తవ్యం.
అంతులేని ప్రశ్నలుండు
అసలు చదవని పుస్తకం.

ఏమీ చదవకున్నా
తప్పక రాయాల్సిన పరీక్ష 
నదిలో సాగే నావలా  
తీరం కోసం నిరంతర నిరీక్ష

కాలప్రవాహాన  గాలివాటున
తెరచాప వంటిది జీవితం
ఏది వచ్చినా మనకోసమే
దైవం పంపిన ప్రసాదం

అపురూపమైన జన్మలో
అనుభవాలే  పాఠాలుగా
ఆనందంగా సాగిపోయే
అమూల్యమైన మరో వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు