చిన్న పిల్లలము మేమని...
మే మేమి చేయగలమని....
అనుకోవద్దేనాడూ.. పిల్లలూ !
చెయ్యాలని అనుకుంటే, మీరు
చెయ్యలేనిదేమున్నదిపిల్లలూ!!
మీరు" టీ వీ "ల్లో ... పిల్లల
.ప్రోగ్రాము లెపుదు చూడలేదా?
మీలాంటి చిన్న - చిన్న
పిల్లలెందరో... ఎన్నెన్నో
గొప్ప పనులు చేస్తున్నారు !
తలచుకుంటె మీరూ...
మీప్రతిభను చూపెట్టగలరు !
పాటలతో ఒకరు -
డాన్స్ లతో ఒకడు....,
తమ - తమ ప్రతిభలు చూపి
ప్రధములుగా గెలిచి....
గొప్పగొప్పబహుమతులతొ ...
చప్పట్లు - పొగడ్తలు !
మీలాంటిపిల్లలే, వారుకూడా!
చక్కగా శ్లోకాలను...
చెబుతుందొక పిల్ల !
గొప్పగా పద్యాలను...
పాడును ఒకబాబు !!
జనరల్ నాలెడ్జ్ లో...
అడుగుతున్న ప్రశ్నలకు
చక - చకా జవాబులను
చెబుతూ... ముద్దొచ్చే
పిల్లలుఎందరెందరో !
సాధనతో ప్రతిభను...
చాటుకొనుటకు...
పిల్లలు - పెద్దలన్న...
తేడాయే లేద ర్రా... !
ఎందరో పెద్దలకన్నా...
కొందరు పిల్లలే...
ఎంతో గొప్పర్రా... !!
వారి వలే... మీరు కూడ
ప్రయత్నించి చూడండి !
మీకిష్టమైనదేదైనా....
.. సాధనచేయ్యండి...,
గొప్పపేరుతో పాటు...
ఎంతో డబ్బును మీరు
పొందగలరు పిల్లలు... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి