ఇష్ట పదులు
============
1
తూరుపు కొండలోన తొలికిరణ
ముదయించె
బాల భాస్కరు వచ్చె భవిత వెలుగులు నింప
ఉషోదయపు వేళలొ యూరంత మేల్కొనె
పల్లె సీమలోనా తెల్లవారిందనుచు
పక్షుల రావాలతో ప్రకృతి పరవశించె
ముంగిట్లో మగువలు ముత్యాల ముగ్గులూ
పూలన్ని వికసించె పూదోట అందాలు
పరిమళ సుగంధాలు పరిసరాలు వ్యాపించె
2
సుప్రభాత సేవకూ శుభసమయమాయెనుగ
రంగురంగుల పూలు రమ్యమైన దండలు
స్వామి పూజలు చేయ సకల శుభములు కలుగు
స్వామి దర్శనానికి సకల భక్త జనులూ
అయ్యవారు ఇచ్చిరి హారతులు స్వామికీ
తీసుకొనిరి భక్తులు తీర్థప్రసాదాలు
ప్రత్యక్ష దైవముగ పాపములు పోగొట్టు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి