దేహశుద్ధి మనోసుద్ది--గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తోమితే
పళ్ళకుపట్టిన పాసిపోతుందిగానీ
మదికంటుకున్న మసితొలుగుతుందా!

కడిగితే
ముఖముమురికి శుభ్రపడుతుందిగాని
మనముమకిలి పరిశుద్ధమవుతుందా!

చీదితే
చీమిడి పోతుందిగాని
చిత్తవికారం తొలగిపోతుందా!

ఊదితే
దుమ్ము లేచిపోతుందిగాని
మనస్సుకంటుకున్న ధూళిపోతుందా!

స్నానంచేస్తే
శరీరం సాపవుతుందిగాని
మనస్సు స్వచ్ఛమౌతుందా!

మెదడును
తెలివితో
నిర్మలంచేద్దాం

మనసును
సత్యముతో
శుభ్రపరుద్దాం

మదిని
మంచితో
మేటినిచేద్దాం

జీవితాన్ని
సుకర్మలతో
విమలంచేద్దాం

బుద్ధిని
ఙ్ఞానముతో
శుద్ధిచేద్దాం


కామెంట్‌లు