ఓ జ్ఞాని వద్దకు ఇద్దరు వచ్చారు.
ఒకడు బాధపడుతూ అడిగాడు...
"నేను పెద్ద పాపం చేసేసాను. నా మనసు దానినే తలుస్తూ నన్ను తోచుకోనివ్వడం లేదు. నేను చేసిన పాపం నుంచి విముక్తి ఉందా అని".
ఇక రెండవతను చెప్పాడు...
"నేను అతనిలా పెద్ద పాపమేమీ చేయలేదు. చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు ఇలా బోలెడు చేసాను. అయినా నేను చేసినవన్నీ శిక్షకు తగినవనుకోను అని"
జ్ఞాని ఓ నవ్వు నవ్వారు.
మొదటి వ్యక్తితో "నువ్వెళ్ళి ఓ పెద్ద బండను తీసుకురా" అన్నారు జ్ఞాని.
రెండవతనితో "నువ్వు నేనిస్తున్న బస్తాను చిన్న చిన్న రాళ్ళతో నింపి తీసుకురా" అన్నారు జ్ఞాని.
ఇద్దరూ వెళ్ళారు.
ఒకడు పెద్ద బండను తెచ్చాడు.
మరొకడు బస్తా నిండా చిన్న చిన్న రాళ్ళు తెచ్చాడు.
అప్పుడు జ్ఞాని "సరే. ఇద్దరూ తీసుకొచ్చిన వాటిని సరిగ్గా ఏ చోట తెచ్చారో ఆక్కడే పడేసి రండి" అన్నారు.
మొదటతను బండను తీసుకెళ్ళి తెచ్చిన చోట పడేసాడు.
ఇక రెండవతను సన్నని గొంతుతో "ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన ఈ చిన్న చిన్న రాళ్ళను సరిగ్గా అదే చోట ఎలా వేయగలను" అన్నాడు.
అంతట జ్ఞాని " మీ ఇద్దరిలో ఒకరేమో పెద్ద తప్పు చేశారు..... అందుకోసం బాధపడి ఏడ్చి క్షమాపణ అడిగి విముక్తి ఉందాని అడిగారు. అతను చేసిన పాపం నుంచి విముక్తి పొందడానికి అవకాశముంది.... మరొకరేమో చిన్న చిన్నవంటూ వెయ్యి తప్పులు చేసినా అవి పాపమని అనుకోవడం లేదు. అయితే ఆ చిన్న చిన్న తప్పులవల్ల ఎందరు బాధపడ్డారో తెలీదు. అనేక తప్పులు చేసీ అవేమీ పాపాలు కావన్నట్టుగా మాట్లాడే రెండో అతనిలో రవ్వంత పశ్చాత్తాపం కనిపించడం లేదు. కనుక అతనికి విముక్తి అసాధ్యమే" అన్నారు.
ఓ తప్పు చేసినప్పుడు అది పెద్దదా లేక చిన్నదా అనేది ప్రశ్న కాదు. తప్పు తప్పే. దానిని మరోసారి చేయకుండా జాగర్త పడాలన్నదే పెద్దల మాట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి