సమ్మతము... సమ్మదము
*****
నిత్య జీవితంలో అనేక అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఇతరుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడే సమ్మతము తెలపడానికి అనేక సందేహాలు సంశయాలు మనసును తొలుస్తూ ఉంటాయి. ఒక్కసారి తొందర పడి సమ్మతించామా ఇక వెనక్కి తీసుకోలేని పరిస్థితి.
కాబట్టి సమ్మతము తెలపడానికి బాగా ఆలోచించాలి.
మాట మీద నిలబడే వారు,మాట తప్పని వారే మానధనులని మనకు తెలుసు. కాబట్టి సమ్మతము తెలిపే ముందు పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలూ ఆలోచించాలి.
సమ్మతము అంటే ఏమిటో అందరికీ తెలిసిందే... సమ్మతి అంగీకారము,అంగీకృతి, అనుమతి,సమాధానము లాంటి అర్థాలు ఉన్నాయి.
సమ్మతము తెలిపే ముందు ఆ విషయంలో, అంశంలో సమ్మదము ఉందా లేదా అనేది పరిశీలించాలి. బాగా ఆలోచించి ఆచి తూచి అడుగు వేయాలి. అది సుహితమా కాదా గమనించాలి.
మరి సమ్మదము అంటే ఏమిటో చూద్దాం... యుక్తము, ఔచిత్యము,అనువు,ఔచితి,యోగ్యత,సబబు,సుహితము,సమంజసము,సమర్ధము,సముచితము లాంటి చాలా అర్థాలున్నాయి.
సమాజ హితమైన వాటికి నిస్సంకోచంగా సమ్మతము తెలుపుదాం.
సమ్మదము ఉన్న వాటికి సందేహం లేకుండా స్వాగతం పలుకుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి