రండి - రండి... పిల్లలూ... !;-కోరాడ నరసింహా రావు.
రండి - రండి  పిల్లలూ.... 
  మా పెరటిలోకి పదండి... !
కాయగూరల - ఆకుకూరల 
 మొక్కలుఎన్నోఉన్నవిఅక్కడ!!

ఇవిగో...ఇక్కడ  వంగమొక్కలు
తెలుపు - నలుపు వంకాయలు 
చూడగ ఎంతో ముచ్చటగున్నవి 

ఆ ప్రక్కనున్నవి బెండమొక్కలు 
ఈ ప్రక్కవి టమాటా మొక్కలు
అదిగదిగోదొండపాదు...ఈమూలన ఉన్నది చిక్కుడుపాదు... !

ఈ ఆనప కాయలు చూసారా... 
 ఎంత పొడవుగా పెరిగాయో.. !
ఆ బీరకాయలు ఇంకా చిన్నవి 
 బాగా పెద్దవి ఔతాయి.... !!

కాయకూరలే కాదర్రా.... ఆకు కూరలూ ఉన్నవి ఆ మూల !
  కొత్తిమీర,మెంతుకూర... 
   తోట కూర,  గోంగూర... !

ఇవియే కాక, బజారులో.... 
కేరట్లు, బీట్రూట్లు, కాకర, ఆగా కర, కేబేజీ, బంగాళాదుంపలు
ఇంకా దొరకును ఎన్నెన్నో... !!

ఈఆకుకూరలు - కూరగాయలు
ఆరోగ్యానికి  ఎంతో మంచివి !
విరివిగా మనమీ కూరలు... 
 తింటూవుంటే...అనారోగ్యము 
   మన దరి జేరదు.... !!

ఈ కూరలు అన్నీ... ఎప్పుడు దొరికిన వప్పుడు కొనుక్కు తిందాము... !
మనం  ఆరోగ్యంగావుందాము!!
   *******

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Super ga vundi