@ వీరుడు @
***
సామ్రాజ్య విస్తరణ పేరుతో
దండెత్తి వచ్చాడు వాడు ..!
ఆత్మాభిమానంతో...అడ్డగించి
పోరాడి...వెన్నుచూపక.... వీరమరణం పొందాడు వీడు.!!
చరిత్రలోఇద్దరూబ్రతికే ఉన్నారు
వాడు చరిత్ర హీనుడయి ... !
వీడు చరిత్ర కారుడయి...!!
*****
. @ !? @
*
వందేళ్లు బ్రతికినా...
చావు తప్పదు... !
వెయ్యేళ్ళు కలిసున్నా...
వేరు తప్పదు... !!
శత విధాల ప్రయత్నించినా...
జరిగేది జరగక మానదు !
ఐనా... తన ప్రయత్నం...
తను చేస్తూనే ఉన్నాడు ...!
ఇతడు . మూర్ఖుడా.... ?!
మేధావా .... !?
*******
* హంస లా.... ! *
*****
ఎంతకాలం బ్రతికామని కాదు
ఎలా బ్రతికామన్నదే ముఖ్యం !
వాడు కల కాలం బ్రతికాడు కాకిలా !
వీడుఅతికొద్దికాలమేబ్రతికాడు
హంస లా.... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి