హిందీ కథల సంకలనం లో జక్కాపూర్ విద్యార్థి కథ ఎంపిక


 బాల చెలిమి  పత్రిక ,చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మణికొండ వేదకుమార్ సంపాదకత్వములో రూపొందించిన హిందీ  బాలల కథల పుస్తకం "ఆలసీ కబూతర్ " ( అనువాద పుస్తకం) లో జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి గోపాలపురం సాయినాథ్ వ్రాసిన "ఖర్ గోష్ ఔర్ హిరణ్ కీ దోస్తీ " కథ ప్రచురితమైనది. ఈ పుస్తకం లో తెలంగాణా లోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు వ్రాసిన 21 కథలు  ఉన్నాయి. తమ విద్యార్థి 2019 లో వ్రాసిన   "కుందేలు -జింకల స్నేహం " అనే తెలుగు కథ ,హిందీ కథల పుస్తకంలో  అనువదించబడడం సంతోషంగా ఉందని  హిందీ ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య అన్నారు. మంగళ వారం పుస్తక ప్రతిని ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య చేతుల మీదుగా  సాయినాథ్ అందుకున్నారు. ప్రస్తుతం బాసర త్రిబుల్ ఐటీ లో విద్యాభ్యాసం చేస్తున్న సాయినాథ్ ను ఉపాధ్యాయులు అభినందించారు.
కామెంట్‌లు