ఇంట్లో ఉంది నలుగురు. కానీ ఎవరిగోల వారిదే! ఆఫీసుకి పరుగెత్తాలని నాన్న వంటపనిలో అమ్మ హైరానా పడతారు. శివా నిద్రమంచం దిగడు లేవమని ఎంత అరిచినా.బామ్మ కనకం మంచం దిగబోతే"అమ్మా! కాసేపు పడుకో" అంటాడు శివా నాన్న. వంటింటిలో కోడలికి సాయంచేయాలని వెళ్తే" ఆలుగడ్డలు పప్పు అన్నం కుక్కర్లో ఉడుకుతున్నాయి.చిక్కుడుకాయలు మధ్యాహ్నం వలుచుకుందాం"అంటుంది కోడలు. చుట్టపుచూపుగా ఓనెల ఉండిపోదామని వచ్చిన కనకంకి ఏమీతోచటంలేదు."అక్కడ ఒంటరిగా ఏంచేస్తావు అమ్మా!ఓ ఆర్నెల్లు ఉండు" అంటాడు కొడుకు. జంతికలు అరిసెలు చేస్తానంటే వద్దు అంటుంది కోడలు." గ్యాస్ దండగ. కష్టపడటం ఎందుకు? ఆయన కొనుక్కుని వస్తారు " అంటుంది కోడలు. ఆరోజు పక్కామెతో గుడికి వెళ్లింది కనకం! పురాణ ప్రవచనం జరుగుతోంది. "పూర్వం ఒక వయసు వచ్చాక పెద్దలు వానప్రస్థంలోకి వెళ్లేవారు. దైవధ్యానం భక్తి తో గడిపేవారు.ఇప్పుడు మగాడు బైట కాలక్షేపం అతని భార్య క్లబ్ మహిళామండలి ఉద్యోగం సెలవుల్లో పిల్లలతో పిక్నిక్ అని వెళ్లి పోతున్నారు. ఇంట్లో వృద్ధులు ఒంటరిగా మిగులుతున్నారు.పిల్లలని ఆడించే ఓపిక ఉండదు.దీనికి సరైన మధ్యేమార్గం ఇంట్లో మౌనంగా ఉంటే చాలు. ముసలివారి గొణుగుడు తప్పుతుంది. పిల్లలు పెద్దలు మాట వినటంలేదు అని బాధపడకూడదు.పిల్లలు కూడా వృద్ధ అమ్మా నాన్నలని కరేపాకులా తీసిపడేయరాదు.వారివల్లనే తాము ఈస్థితిలో ఉన్నాం అని గౌరవించాలి. అలా ఎవరికి వారు నోటికి తాళం వేస్తే కుటుంబంలో గొడవలు రావు." కనకం కి తన కర్తవ్యం బోధపడింది🌷
నోటికి తాళం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి