యదృశ్యం... తన్నస్యం... !;- కోరాడ నరసింహా రావు.
 ఈ భౌతికప్రపంచం...అస్తిరమే 
మొన్నలా... నిన్నలేదు... 
   నిన్నలా... నేడూ లేదు... 
    నేటిలానే...రేపూ ఉండిపోదు
     పాత ఆకు రాలి.... 
        కొత్త  ఆకు  చిగురించినట్లే 

 ఉన్నన్నాళ్ళు... ప్రకృతిని..
   భౌతిక పరిణామాలను... 
  గమనిస్తూ,సాక్షీ భూతులమై . 
  ఆస్వాదిస్తూ...అనుభూతిస్తూ
    ఆనందించటమే వివేకం !!
       *******


కామెంట్‌లు