సుప్రభాత కవిత ; -బృంద
శిలలను తడుపుతూ జలం
ఎదలను తడుతూ  కాలం
కాలపు మాయాజాలంలో
చిక్కిన జీవజాలం.

సంతోషపు ఘడియల
ఆనందం ఘనీభవించి
కిరణాల స్పర్శకు 
స్ఫురణకు వస్తున్నట్టూ....

ఎదురు చూచు ఎదలకు
ఎదురయే కలలాగా
ఉదయించే రవి బింబపు
ప్రసరించేవెలుగులు

అనుక్షణం మనసులో
అనుభూతుల సంచారం
అనుదినం  వేకువనే
అనుగ్రహించు  దైవం.

ప్రభవించే వేకువన
పరిమళించు ప్రకృతి
పరవశించు  మనసు
పులకరించు  రీతి.

ఆకుకైన పువ్వుకైన
అలలకైన శిలలకైన
గిరులకైన తరులకైన
నీటికైనా నింగికైనా

ఉషోదయ కాలంలో
ఉత్సాహపు కదలికలు
తరగని తలపుల గనుల
దొరికిన మేలిమి రత్నాలు

అందమైన ఉదయం కోసం
ఎదురుచూసే మనసు పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు