గెలుపుకోసం...
పోరాడిన ప్రతిసారీ...
ఓటమినే చవిచూస్తున్నాం !
ఎప్పుడైనా....
గెలిచినవారే గొప్ప కదా... !
నా అస్త్ర, శస్త్రాలేవీ....
పనిచేయటం లేదు...!
ప్రత్యర్థుల దగ్గరున్న...
ఆ దివ్య శస్త్రాస్త్రాలేమిటో
నాకు బోధపడటం లేదు.!
సందర్భానికి తగ్గట్టుగా...
తగిన అస్త్రాన్నేప్రయోగించినా
ఛేదించలేక వ్యర్ధమౌతుంటే
నా సామర్ధ్యం మీద నాకే
అపనమ్మకమౌతోంది !!
లోపమెక్కడుందో....
బోధపడటం లేదు... !
ఐనా తప్పదు... !
యుద్ధంలో వెనుతిరిగి...
వెన్నుచూప రాదు కదూ !!
జయించానా....
విజయానందైశ్వర్యాన్ని
భోగిస్తాను... !
ఆఖరివరకూ
. ఓడిపోతూనే యున్నా...
ఫరవాలేదు.....
సమరవీరునిగా...
లోకం గుర్తిస్తుంది.. !!
ఓటమికి...భయపడో,బాధతోనో పారిపోవటంకన్నా....
మరణించేవరకూ... నిలిచి
పోరాడి వీరుడు గానే
నిలుస్తా..... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి