హైకూలు ;-ఎం. వి. ఉమాదేవి
🌼గోరంత పూలు 
    బారెడు కాయలతో 
మునగ చెట్టు 🌿

📯ఒంటరి చెప్పు 
    వేచిoది జంటకోసం 
పెళ్లిపందిరి 👠

🎑మాయ కమ్మింది 
   మంచుకురిసేవేళ 
రోడ్డు అదృశ్యం ⛈️

⛳️ కూలీ విషాదం 
   కోత మిషన్ తోటి 
        దళారి రాక 😰

🤝 రోజూ మాటలే 
    ప్రహరీ గోడపైన 
మందార పూలు  🌺          


కామెంట్‌లు