సరిహద్దుల సైనికుడా
దేశానికి రక్షకుడా
మాతృభూమి సేవలోను
త్యాగంతో తరించేను!
అయినవారి నొదిలేసి
ప్రాణాలకు తెగించేసి
మంచుకొండ ప్రాంతాలలో
కాపుకాసె బాడరులో!
కష్టాలకు జడవకుండా
విశ్వాసం వీడకుండా
వెలుగుతున్న దివిటీలు
భరతమాత ప్రియపుత్రులు!
అణువణువున నిస్వార్ధం
దేశసేవ పరమార్థం
అలసటయే తెలియకుండా
కీర్తినొందు అవనినిండా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి