నవ్వు;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పాపాయి ఎందుకో ఏడ్చింది
తాతయ్య నానమ్మ వచ్చారు
అమ్మా నాన్నా వచ్చారు
అక్కా అన్నా వచ్చారు
ఇరుగూ పొరుగూ వచ్చారు
అందరూ వచ్చినా పాపాయి
ఏడ్పు ఆపాలేదు ఎందుకో
అప్పుడే వచ్చింది కోయిలా
కుహూ అంటూ కూసింది ఇలా
అప్పుడే వచ్చింది రామచిలుకా
ఏడవకుపాపాయి అంది తియ్యగా
అప్పుడే వచ్చింది నెమలి
నాట్యమూ చేసీ చూపిందీ
అప్పుడే వచ్చాడు కోతిబావా
పాపాయినే వెక్కిరించాడూ
అదుగో అదుగో అదుగో
పాపాయి కళ్ళెంతో మెరిశాయీ
అప్పుడూ నవ్వింది పాపాయీ
నవ్వుతూనే ఉంది పాపాయీ
అందరూ నవ్వారు అదిచూసీ!!
*********************************

కామెంట్‌లు