ఆటో డ్రైవర్- జగదీశ్ యామిజాల
 ఆటో కోసం చప్పట్లు కొట్టినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది...నా ముందుకొచ్చి ఆగిన ఆటోలో నవ్వుతూ పలకరించిన డ్రైవర్ ఓ ముస్లిం మహిళ కావడంతో!
తిరువల్లిక్కేణిలో ఓ ఆలయం పేరు చెప్పి అక్కడికి వెళ్ళాలన్నాను. ఇలా అడిగినప్పుడు చెన్నై ఆటో డ్రైవర్లు ఓ రేటు చెప్పడం అలవాటు. కానీ ఆమె ఎంత కావాలో చెప్పక ఆటో ఎక్కమన్నారు.
 ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆమెతో మాటలు కలిపాను.
వ్యాసర్ పాడికి చెందిన ఆమె పేరు ప్యారీ ఫాతిమా.ముగ్గురు పిల్లల తల్లి. ఆరు నెలలుగా ఆటో నడుపుతున్నారు. ఆమె భర్త ఆటో డ్రైవర్. ఆయన దగ్గరే ఆటో నడపటం నేర్ఛుకున్నారామె. రోటరీ క్లబ్ సాయంతో పద్ధతి ప్రకారం నేర్చుకుని లైసెన్స్ పొంది ఇప్పుడు ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు ఫాతిమా. 
 ఒక రోజు ఆటో నడిపితే దానికివ్వాల్సిన అద్దె 200 రూపాయలు. 
ఉదయం పది నుంచి రాత్రి 8.30 వరకూ ఆటో నడుపుతారు. ఖర్చులన్నీ పోగా రోజుకి అయిదు వందల రూపాయలు లభిస్తాయి.
భర్త తిరుప్పూరులో వ్యాన్ డ్రైవర్. చెన్నై నగరంలో ఏ సమస్యా లేకుండా తృప్తిగా ఆటో నడుపుతున్నట్టు ఇమె చెప్పారు. ఎవరి మీదో ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు. ఇలా బతకడంలో బోలెడంత ఆనందం పొందుతున్నానన్నారు ఫాతిమా.
చెన్నైలో ఫాతిమా ఆటోలో నిన్న ప్రయాణం చేసిన ఓ వ్యక్తి చెప్పిన మాటలివి.

కామెంట్‌లు