నటించు...నాటించు
*****
నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని నటించు వారు,నటించుటనే ప్రవృత్తిగా చేసుకునే వారు, నచ్చిన వారిని చూసి నటించు వారు,నటించుటలో జీవించి ప్రేక్షకులను మెప్పించి కన్నీళ్ళు తెప్పించు వారు... ఇలా రకరకాల వారిని మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ ఉంటాం.
ఇంతగా చెప్పుకునే నటించు అనే పదానికి నిఘంటువులో ఉన్న అర్థాలు ఏమిటో చూద్దాం.
నటించు అంటే అనుసరించు,అనుగమించు,అనువర్తించు,చలుపు,తొడరు లాంటి అర్థాలతో పాటు అభినయించు, నాట్యం చేయు,నర్తించు, చిందులు త్రొక్కు లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడపాలంటే మహనీయుల బోధనలను వినడం,వారి బాటలో నడవడంతో పాటు, వారి ఉన్నతమైన అలవాట్లను అనుసరించాలి .
మంచిని గ్రహించి నటించుటే కాదు.ఆ మంచి, మానవతా విలువలను ప్రతి హృదయంలో నాటించాలి.
ముఖ్యంగా భావి తరాలకు ప్రతినిధులు అయిన బాలల్లో నైతికతను నాటించాలి.మనం భూమిలో ఏమి నాటితే అదే మొక్క మొలుస్తుంది.అలాగే పిల్లల స్వచ్ఛమైన హృదయ క్షేత్రాలలో ఉన్నతమైన విలువలను నాటించితే అవే వారి సత్ప్రవర్తనకు బాటలు వేస్తాయి.
నాటించు అంటే ఏమిటో చూద్దాం నాటు,పాతు,గ్రుచ్చు,అలుకు,పెట్టు,తొట్టు లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
మంచిని గ్రహించి నటించు.
సమతా మమతా భావనలు పదుగురిలో నాటించు.అదే సమాజంలో పౌరుడి ముఖ్య కర్తవ్యమని గమనించు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి