శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 శిశోదయా వంశం మూలపురుషుడు బాపా రావల్.అప్పటిదాకా గహలోత్ వంశం గా పిలువబడింది.సిసోదా అనే పల్లెలో బాపా నివసించాడు.అలా సిసౌదియా అని పిలువబడినాడు.ఉదయపూర్ కి15కి.మీ.దూరంలో ఉంది.మహారాణాప్రతాప్ ఈవంశంవాడే! వీరిలో ముఖ్యతెగలుహాడా చంద్రావత్ ముక్తార్ రాణావత్.
సిరోహి రాజస్థాన్ లోని ఓనగరం.ఇక్కడ కత్తులు ఖడ్గాలు తయారు చేసేవారు. ఖడ్గం ని సిరోహి అనేవారు.తమపేరు చివరి సిరోహి అని పెట్టుకుంటారు కొందరు.
సియాల్ కోట్ ప్రాచీన నామం స్యాల్ కోట్.మద్రదేశరాజధాని.మాద్రి సోదరుడు శల్యుడు నిర్మించాడు.జర్తులు (జాట్ తెగ) ఈమాద్రులను తరిమేశారు.ఇది మిలింద్ సామ్రాట్ రాజధాని గా ఉండేది.
సంస్కృతకోశం ప్రకారం సాహసికుడు అంటే బందిపోటు భయంకర పనులు చేసేవాడు అని అర్ధం.కానీ హిందీలో వీరపురుషుని సాహసిక్ సాహితీ అని అంటారు

కామెంట్‌లు