పాపం, ఆ మనిషి!;-- యామిజాల జగదీశ్
అప్పుకోసం 
పీల్చిపిప్పి చేసినతను 
ప్రేమను మరచినతను
ద్రోహం చేసినతను
పాపం చేసినతను
లేదని చెప్పినతను
జాలి చూపనతను
నన్నడగకని చెప్పినతను
శ్రమను దోచుకున్నతను
అబద్ధపు ముసుగు తొడుక్కున్నతను
ఇలా రకరకాల మనుషులు 
గుమికూడారు
ఓ నిరాశ్రయ మనిషి శవయాత్రలో ....
" పాపం. చాలా మంచి మనిషి! 
ఇలా అర్థంతరంగా 
ముగిసిపోవాలా అతని కథ" అంటూ
మాటలు కుమ్మరిస్తున్నారు,
ఒక్కరి కళ్ళల్లోనూ కన్నీటి చుక్క లేదు!!

దూరాన ఓ కాకి మాత్రం
విలపిస్తోంది
విచారిస్తోంది
ఎప్పుడో ఆ మనిషి పెట్టిన 
ఓ పిడికెడు అన్నాన్ని 
స్మరిస్తూ


కామెంట్‌లు