అద్దంకి లక్ష్మిని వరించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్

 ముంబై పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి అద్దంకి లక్ష్మీ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. శ్రీమతి నెల్లుట్ల సునీత సంపాదకత్వంలో ISBN (ఇంటర్నేషనల్ బుక్ స్టాండర్డ్ )తో వెలువడినతేనె ఊటల తెలుగు సున్నితం ప్రక్రియకు, గ్రంథానికి, గ్రంధంలో రాసిన 130 కవులతో పాటుగా అద్దంకి లక్ష్మీ గారు కూడా సున్నితం రచన అందులో ప్రచురితం కావడం వలన తెలుగు బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించుకున్నారు. అందులకు అద్దంకి లక్ష్మి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ... సున్నితం సరళ శతకం రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డును వరించినందుకు
 సాహితీ బృందావన విహార వేదిక వారు , ఉమెన్స్ రైటర్స్  అసోసియేషన్ నేషనల్ మహిళా రచయితల సంఘం , సున్నితం కుటుంబం కవుల , ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మిత్రులు ,అద్దంకి లక్ష్మిని  అభినందించారు.
కామెంట్‌లు