అశోకచక్ర పొందిన తొలి భారతీయ వనిత! (అచ్యుతుని రాజ్యశ్రీ)

 నీరజాభనోట్ పేరు అపరిచితం .కానీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి 400మంది విమానప్రయాణీకులను కాపాడిన సమయస్ఫూర్తి సాహసం ఉన్న తరుణి! బాల్యం నుంచి  ముద్దుమురిపాలలో పెరిగిన అందాలబాల నీరజాభనోట్! సినిమాలంటే తగని పిచ్చి! రాజేష్ ఖన్నా సినిమాలు తెగచూసేది.7సెప్టెంబర్ 1963లో చండీగఢ్ లో పంజాబీ కుటుంబంలో పుట్టింది. తండ్రి పత్రికా విలేఖరి. నీరజ ముంబై సెయింట్ జేవియర్ కాలేజీ నించి డిగ్రీ పొందింది. 1985లో వ్యాపారవేత్త తో పెళ్లి ఐంది. కానీ గృహహింస కి గురియై రెండు నెలలకల్లా పుట్టిల్లు చేరింది. మోడలింగ్ చేస్తుండగా ఏయిర్ హోస్టెస్ ఉద్యోగం రావటం ఓపెద్ద మలుపు. 1986లో కరాచీలో విమానం బైలుదేరే సమయానికి  నలుగురు టెర్రరిస్టులు  పైలట్ ప్రయాణీకులని తుపాకులతో బెదిరించారు. హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.నీరజ సమయస్ఫూర్తి తో తలుపు తెరిచి విమానం లో వారిని బైట కి పంపేసి తాను మాత్రం దుండగుల తుపాకీకి బలైంది.2016లో సోనంకపూర్ నటించిన బయోపిక్ విడుదల కావటంతో నీరజ త్యాగం లోకానికి వెల్లడైంది. భారత ప్రభుత్వం అశోక చక్రతో నివాళి అర్పించింది.ఇంకో విశేషం ఏమంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా  తమగా-ఎ-ఇంసానియత్  ప్రదానం చేసింది. 2004లో ఆమె స్మారక తపాలా బిళ్ళ విడుదల ఐంది. పిన్న వయసులో  ఎలాంటి సుఖసంతోషాలు నోచుకోకుండా తన ప్రాణాలను అర్పించి విమానప్రయాణీకులను కాపాడిన నీరజా భనోట్ చిరస్మరణీయురాలు🌷
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం