మనిషికి బుద్ధి మనసు ఆలోచించేశక్తి ఉన్నాయి.క్లాస్ లో ఎంతో మంది ఉన్నా టీచర్ ఒకేలా పాఠం చెప్పినా వారి వారి వివేచన శక్తి యుక్తులను బట్టి అర్ధం చేసుకుని మార్కులు పొందుతారు. ఒక గురువు దగ్గర ఎంతోమంది శిష్యులు ఆధ్యాత్మిక భావాలు బాగా వంట పట్టించుకుని ఆచరణలో పెట్టేవారు.ఒక శిష్యుడు అసలు తనలోకంలో ఉండేవాడు. శివా అనే అతను ధైవంపట్ల విముఖత తో ఉండేవాడు."శివా!నీవు పరీక్షిత్తు మహారాజు లాగా ఉండాలి. తాను ఏడురోజుల్లో చనిపోతాడు అని తెలిసి విరాగియైభగవస్మరణలో మునిగాడు.సరే నీకో రహస్యం చెప్తా విను.నీవింక మూడు నెలలకు మించి బతకవు.పీబద్ధకం నిర్లక్ష్యం విడిచిపెట్టు." అంతే !శివా లో పెనుమార్పు! భక్తి సమయపాలన గురువు చెప్పేది వినటం మిగతా సమయంలో దైవధ్యానం లో మునిగిపోయాడు.మూడు నెలలు ముగిశాయి. "గురూజీ! నేను ఎప్పుడు చనిపోతాను?" "దేవుడు అనుగ్రహించాడు. నీజీవితం పొడిగించాడు.నీచిత్తం వచ్చినట్లుగా బతుకు ". దాని కి శివా ఇలా అన్నాడు "దైవధ్యానం తో నాకు ప్రశాంతత కుదురు ఏర్పడింది.మళ్ళీ పాపపు ఆలోచనలు చెడు అలవాట్లజోలికి పోను."ఇదీ అసలైన కుదురైన మనసు!🌹
మనసు!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి