భావాలు తేడాలు!అచ్యుతుని రాజ్యశ్రీ

 రాము  ఒక జోలెను రెండు భాగాలుగా చేసిఒకటి ముందు  రెండోది వీపువెనుక వేలాడేశాడు.వెనుకదానిలో మంచి పనులుమాటలు మోస్తున్నాడు.పొట్టపైన వేలాడే దాని లోఅందరిచెడు అత్యాచారాలు ఉంచాడు."ప్రపంచంలో అంతా చెడు"అని బరువు గా పొట్టపై వేలాడుతూ ఉంది అని బాధ పడేవాడు.సోము పొట్టపైన జోలెలో అంతా మంచిని దాచి వీపు వెనుక తప్పులు  అవినీతి పెట్టాడు. శివా మాత్రం జోలెలో మంచి భావాలు ఉపదేశాలు దాచి హాయిగా ఉల్లాసంగా ఉన్నాడు.వెనుక జోలె ఖాళీగా ఉంది.  వారిని చూసి ఆఊరి పెద్ద అడిగాడు "మీముగ్గురూ ఏంమోసుకుని పోతున్నారు?" అని. తనమాటలతో రాముకి ఇలా బుద్ధి చెప్పాడు" నీవు చెడు విషయాలు పొట్టపైన జోలెలో ఉంచి సదా వాటినే చూస్తావు.నెగిటివ్ ఆలోచనలే నీకు వస్తాయి. సోము నీవు చెడునంతా వెనక నడీచేవారికి కన్పడేలా పెట్టావు.అలా నెగిటివ్ భావాలు అందరికీ కలిగేలా చేస్తున్నావు.శివామంచి నంతా ముందు వేలాడే జోలెలో ఉంచి  వెనక జోలెకి చిల్లి పెట్టాడు. అలా చె డు  ఎప్పటికప్పుడు  జారిపోయి వెనకాల ఉన్న వారిలో పాజిటివ్ భావాలే కలిగిస్తుంది. అందుకే  హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. శివా శ్రేష్ఠుడు.మంచి పంచాలి సకారాత్మకభావాలు అందరిలో కలిగించాలి."మనం ఐనా అంతే! చెడు ఆలోచన లేకుండా మంచిఆలోచన తో ఉండాలి. యద్భావం తద్భవతి🌹
కామెంట్‌లు