గీతా తత్త్వం (3);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మానవ జీవితం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే అంతవరకు కూడా  తాను చేసే పని ధర్మబద్ధంగా చేయడం కోసం అనేక నీతులతో కూడిన పద్ధతులను మనకు అందించారు  పెద్దలు. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయాలి తప్ప పెడత్రోవ పట్టకూడదు  నీవు చేసిన ఏ కార్యక్రమం అయినా కార్యమైనా  దాని ఫలితాన్ని నీవు ఆశించవద్దు. నీకు రావలసిన ఫలితం వచ్చి తీరుతుంది  రాకూడనిది నీకు నీవు ఎంత ప్రయత్నించినా రాదు  అన్న విషయాన్ని  ఆరు అధ్యాయాలుగా విభజించి  మనకందించారు శంకరా చార్యుల వారు.  ఏ పని చేస్తున్నావు అది ఎందుకు చేయవలసిన అవసరం వచ్చిందో నీ మనసుకు అది తెలిసి ఉంటేనే చేయి  అనవసరమైన వాటి జోలికి వెళ్ళవద్దు  అని మరొక ఆరు అధ్యాయాలలో  జ్ఞాన విభాగంగా మనకందించారు.
ఇక చివరి  ఆరు అధ్యాయాలలో భక్తి మార్గాన్ని గురించి మనకు వివరించారు  భక్తి అంటే మనకు తెలిసినది  దేవునిదో దేవతదో విగ్రహాన్ని పెట్టుకొని  పూలు పళ్ళు తెచ్చిపెట్టి పసుపు కుంకుమలతో  అలంకరించమని కాదు  దాని అర్థం. ఏ పని నీవు చేయదలుచుకొని దానిని ఆలోచించి మంచిది నలుగురికి సహకారిగా ఉంటుంది అని తల పెట్టావో  దానిని నమ్మి  అంకితభావంతో దాని మీదే  శ్రద్ధ ఉంచి  చేయి అన్నది గీతా సిద్ధాంతం  మానవ శరీరంలో ఉన్న గీత వెన్నుపూస  అది ఆలోచనలకు మూలం ఒకే విషయాన్ని అనేక రకాలుగా ఆలోచించి  బుద్ధిని గందరగోళ స్థితిలో పెడుతుంది  కనుక దానిని అధీనములో గనక ఉంచినట్లయితే నీవు ఏది చేయదలుచుకున్నావో అది చేసి నీవు ఏ గమ్యానికి చేరాలని మనసులో భావించావో అక్కడకు తప్పకుండా వెళ్లి తీరతావు  అని భౌతిక శాస్త్ర అర్థం.
ప్రపంచ దేశాలకే దివ్వె  వెలుగు చూపిన ఏకైక వ్యక్తి వాల్మీకి మహర్షి ఇచ్చిన రామాయణం  అది పారాయణం చేయడానికి ఉపయోగించే గ్రంథం కాదు  వాల్మీకి మహర్షి రాసిన ప్రతి అక్షరాన్ని ప్రతి ఒక్కడు అర్థం చేసుకొని  ఆ పద్ధతిలో జీవితాన్ని గడిపితే  ధర్మ మార్గానికి ఏది అడ్డు వస్తుందో దానిని తొలగించుకుంటూ వెళ్లి సమాజానికి దేశానికి ప్రపంచానికి హితాన్ని చేకూర్చిపెట్టే  అద్భుత  గ్రంథ రాజం రామాయణం. రాముడు చుట్టూ తిరిగే కథ అని దాని శబ్దార్థం  కానీ ఆ రాముడు ఎవరు రామ శబ్దానికి అర్థం ఏమిటి తెలుస్తుందా  అంకిత భావంతో ఏది చేయాలో దానిని మాత్రమే చేసే వాడు  రమః రమించేవాడు  అంటే అంకితభావంతో  పనిచేసేవాడు  ప్రపంచానికి అంకిత భావాన్ని చూయించింది చెప్పింది చేయించింది వేదం కాదా....!



కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం