వాల్మీకము (పుట్ట) నుంచి వచ్చిన మహానుభావుడు కనుక ఆ పుట్టకున్న అనేక కన్నులను తనవిగా చేసుకొని వేయి కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూసినవాడు. ప్రపంచము అంటే మనం చెప్పుకుంటున్నట్లుగా దేశముల కలయిక కాదు మన పెద్దలు మనలను హెచ్చరిస్తూ ఉంటారు నీ ప్రపంచంలో చూసుకోరా అని. ప్ర అతి పెద్దదైన పంచ పంచభూతములతో ఏర్పడినటువంటి తనువు శరీరం ఈ శరీరంలో ఉన్న సాత్విక రాజస తామసాలలో దేని లక్షణం ఏమిటి దేనిపరిధి ఎంత అని తెలియజేసిన వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి కనుకనే రామాయణంలో ఆయన నామకరణం చేసిన ప్రతి పేరుకు అద్భుతమైన అర్థం ఉంది అది మనం తెలుసుకోగలిగితే ఆ పాత్ర యొక్క నిజ స్వరూపం ఏమిటో ఎలా ఆ పాత్ర ఈ భూమి మీద ప్రవర్తిస్తుందో మనకు తెలిసిపోతుంది అది వాల్మీకి మహర్షి ప్రజ్ఞ. రామాయణంలో నాయకుడు ప్రతి నాయకుడు పేర్లు రాముడు వారి తండ్రి దశరథ మహారాజు దశరథులు అంటే 10 రథములు కలిగిన వాడు అని నిజానికి ఆ మహారాజుకు ఉన్నది 10 రథములేనా ఎక్కువా తక్కువా అంటే వారు చెప్పదలుచుకున్న విషయం 10 మంది యుద్ధ నైపుణ్యం కలిగిన వారు 10 రథాలతో వచ్చి తనతో పోట్లాటకు సిద్ధంగా ఉన్నా తన ఒక్క రథంతో ఒంటి చేతితో వారందరినీ గెలవగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడు అని చెప్పడం వారికి మూడు వివాహాలు చేయించారు ప్రథమ వివాహం కౌసల్య ఒకవేళ దశరథ మహారాజు మరణించినా తన రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా కాపాడే ధైర్య స్తర్యములు కలిగినది ఆ కౌశల్యం ఉన్నది కనుకనే ఆ పేరు పెట్టారు అలాగే రెండవది సుమిత్ర మంచి స్నేహాన్ని కోరుకునేది. ఒకవేళ దశరథ మహారాజు కాలవశాన మరణించినా తన సామంత రాజులతో యుద్ధం చేయడం వల్ల వైరాన్ని పెంచుకోవడం వల్ల కాకుండా స్నేహాన్ని పెంచుకోవడం వల్ల మాత్రమే తన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని తెలుసుకున్న వ్యక్తి కనుక ఆ పేరు సార్ధకం ఇంకా చివరి ముద్దుల భార్య కైక క ఏక శబ్దాలు కలిస్తే కైక తాను తప్ప మిగిలిన వారు కాదు అన్న అర్థం ఏ పని చేయవలసి వచ్చినా మంచిగానీ, చెడు కానీ తన వల్ల మాత్రమే సాధ్యము అని చాటుకోగలిగిన వ్యక్తి కనుకనే పూర్తి రామాయణం జరగడానికి కారణ భూతమైన వ్యక్తి కైకగా చెప్పుకుంటున్నాం మందర మాటలు దానికి దోహదపడినా దాని వెనుక ప్రధాన అంశం తన అహంకారం తన స్వార్థం తన బిడ్డకు రాజ్యం దక్కాలి
అన్న తపన దానితో రామాయణం శాశ్వతంగా నిలిచిపోయింది.
అన్న తపన దానితో రామాయణం శాశ్వతంగా నిలిచిపోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి