ఆకాశవాణిలో రూపక కార్యక్రమాలను గురించిన వివరణ బందా గారు మాకు చెప్పరు. నాటకం, ప్రకరణం, బాణం, ప్రహసనం, దినం, వ్యాయోగం, నవమాకారం, వీధి, అంకం, ఈహామృగం అన్న 10 విభాగాలను కలిపి దశవిధ రూపకాలుగా చెప్పబడతాయి. ఆకాశవాణిలో రూపక ప్రక్రియను మూడు విధాలుగా రూపకంగా, సంగీత రూపకంగా, డాక్యుమెంటరీ రూపకంగా ప్రసారం చేస్తాము. ఈ రూపకాలలో నాటకీయత ఉండదు విషయ పరిజ్ఞానానికి ప్రథమ ప్రాముఖ్యత మనం ప్రసారం చేసిన స్త్రీ అన్న రూపకంలో ఆమెకున్న నాలుగు వ్యవస్థలను బాల, యవ్వన, ప్రౌడ, వృద్ధాప్యాలను గురించి ఆమె మానసిక విశ్లేషణతో కూడిన సంభాషణ రూపంలో ఒక గొంతు స్త్రీ మరో గొంతు పురుషునిదిగా ఏర్పాటు చేస్తాం. దానితో స్త్రీ సంపూర్ణ స్వరూపం వినే శ్రోతకు తెలుస్తుంది.
మానవ జీవన పద్ధతిని తెలియజేయడం కోసం జీవన స్రవంతి అన్న పేరుతో సంగీత రూపకాన్ని మనం ప్రసారం చేశాం. దీనిలో రెండు స్త్రీ పురుష గొంతులు ఉంటాయి. కొంచెం వివరణ ఇచ్చిన తర్వాత గేయం కానీ కీర్తన, కానీ కృతి కానీ పద్యం కానీ ఉంటాయి. ఈ సంగీత రూపకం పూర్తి అయ్యేసరికి మానవుని జీవితంలో ఉన్న పద్ధతులన్నీ తెలుస్తాయి డాక్యుమెంటరీ రూపకం దీనిని ప్రభుత్వం వారు అందించిన లెక్కల ప్రకారం ఏ విషయాలు అయినా వ్యాఖ్యాన రూపంలో రూపుదిద్దుతాం. దీన్ని వాస్తవ, చిత్రన అని కూడా పిలుస్తాం. విక్రాంత గిరి శిఖరం దానిని నాటకంగా ప్రదర్శించలేము కదా ఎవరెస్ట్ ఎక్కిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో వారు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కుకుంటూ వెళ్లారో మధ్యలో వారి బాధలు కష్టాలు ఆకలి వాటి గురించి వారు మాట్లాడుకుంటున్న సంభాషణలను కూడా జోడించి నాటకీయత లేకుండా సహజంగా వారు మాట్లాడుకుంటున్న పద్ధతిలోనే ప్రసారం చేశాం. కనుకనే దీనికి జాతీయ పురస్కారం కూడా వచ్చింది మన కేంద్రానికి.
అలాగే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్న సంగీత రూపకాన్ని కూడా స్త్రీకి స్వాతంత్రం ఎందుకు ఇవ్వలేదు ఆమెకు అర్హత లేదా? అన్న విషయాన్ని గురించి సంభాషణ రూపంలో స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు భేదాన్ని తెలియచేస్తూ ఆ విషయాన్ని గురించి సంభాషణ రూపంలో ప్రసారం చేసినందు వల్ల దానికి అంతర్జాతీయ బహుమతి జపాన్ వారు మన కేంద్రానికి పంపించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి