గీతా తత్త్వం (5);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు  సీతాదేవి తను రావడానికి  సిద్ధమై  జీవితంలో స్త్రీ ఇలా ఉండాలి అని నిరూపించిన పతివ్రతలకే పతివ్రత సీతా మహాతల్లి.  అందుకే ఈనాటికీ ఆమెను తల్లి గానే పూజిస్తాం. తన తల్లి భర్తతోనే జీవితం తాను ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే వుండాలి అని చెప్పిన మాటను కార్యరూపంలో చూపించింది. నిజానికి కైక  సీతను వనవాసానికి పంపమని అడగలేదు  తనంతట తాను బయటకు వచ్చింది  వ్యష్టిగా ఉన్న సీత  వ్యక్తిగా సీతారాములుగా మారిన తరువాత  ఇద్దరూ వేరు కాదు అత్తనారీశ్వరుడు నాకు నేను  అన్న దృక్పథంతో ధర్మాన్ని నిలబెట్టడం కోసం  అష్ట కష్టాలు పడి  14 సంవత్సరాల జీవితాన్ని గడిపింది. 14 సంవత్సరాల నియమం పెట్టడానికి కారణం  ఆ 14 సంవత్సరాల లో పరిపాలించిన వాడు మాత్రమే రాజుగా పరిగణించబడతాడు  అని ఆనాడు ఉన్న  న్యాయ సూత్రాన్ని అనుసరించి చేసిన  ఒప్పందం అది.
న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి  కనుకనే ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని  ఏ కార్యాన్ని ప్రారంభించిన  దానిలో విజయాన్ని మాత్రమే  పొందాడు. రెండోవాడు లక్ష్మణుడు (సుమిత్ర కొడుకు కనుక సౌమిత్రి) లక్ష్యమును చేరిన వాడు లక్ష్మణుడు  జీవితంలో ఏదైనా ఒక ఆశయాన్ని ఆదర్శప్రాయంగా  తీసుకొని దానికోసం ప్రయత్నం చేసిన వాడు  తన లక్ష్యాన్ని చేరుకుంటాడు  సాధకునిగా భగవంతునిలో లీనం కావడం కోసం మోక్షం కోసం బయలుదేరిన లక్ష్మణుడు  దానిని సాధించాడు  తరువాత భరతుడు  అతని వల్లనే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని చాలా మంది చెబుతారు  మరి వేసమహర్షి రాసిన శకుంతలంలో  శకుంతల కుమారుడు కూడా  అదే కదా ఆ పేరుతో వచ్చిందన్నది కాదు వెలుగును చూపు వాడు అని అర్థం  నిజానికి ధర్మాన్ని ఎలా పాలించాలి  నాకు రాజ్యం మీద ఏ ఆశ లేదు ఇది రామ రాజ్యం  కనుక అన్నను బ్రతిమలాడి వారి పాదుకులను తీసుకుని వచ్చి వారి పాదుకులను సింహాసనాన్ని అధిష్టించి  రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప తన పేరుతో కాదు.
చివరివాడు శత్రుగునుడు  శత్రువుల గుండెలో ఉన్నవాడు  ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా  తన శక్తి సామర్ధ్యాల చేత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ గలిగిన ధీశాలి. ధైర్య స్త్యేర్యలకు పుట్టినిల్లు  రామరాజ్యాన్ని  రక్షించడానికి  తన పాత్ర ఎంతో ఉంది  అలాగే  ప్రతి నాయకుడైన  రావణాసురుని గురించి  దశకంఠుడు  అని పేరు. ఎవరికైనా 10 గొంతులు, 10  తలలు పది ఉంటాయా?  పదిమంది మేధావులు వచ్చి కూర్చుని  ఏదైనా తెగని విషయాన్ని గురించి చర్చించినప్పుడు  దానికి సరైన  పరిష్కారాన్ని చూయించగలిగిన  దానిని గురించి వాదించగలిగిన పటిమ కలిగినవాడు  దశకంఠుడు  10  మేధావులు ఆలోచించ గలిగిన శక్తి మేర  ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలిగిన మేధావి కనుక  పది గొంతులు కలిగిన వాడు అని చెప్పుకుంటారు.కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం