గీతా తత్త్వం (6);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 వేద శాస్త్రం తెలిసిన  మహానుభావులు  ఖగోళ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి  వాటి గమనాన్ని  పరిశీలన చేసిన తర్వాత  రాసులు అన్న పేరుతో  విభజన చేశారు  మొదటి దానిని మేషం అన్నారు  అంటే మేక  అది దాని ఆహారాన్ని ఎలా  స్వీకరిస్తుందో  అలా చేయాలి అని చెప్పడం కోసం ఆ పేరు  తరువాత వృషభం అన్నారు  అంటే ఎద్దు  ఆ ఎద్దు  ఎలా కష్టపడి 24 గంటలు పని చేస్తూ ఉంటుందో అలా పని చేయాలి అని చెప్తారు  తరువాత మిథునం  భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వ్యక్తిత్వంతో  ఏకాభిప్రాయంతో  జీవించమని చెప్తారు. కర్కాటకం అంటే పీత అది పట్టిన పట్టు విడువని  జీవి దానిలా జీవించమంటున్నారు. తరువాతది సింహం  పరాక్రమం కలిగిన వ్యక్తిగా సమాజంలో పేరు పొందాలి  అవసరమైన వాటిని తప్ప అనవసరమైన వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పడం కోసం. తర్వాత కన్య  బాల్యం నుంచి కొంచెం పెరిగిన తర్వాత  స్త్రీ అందగత్తెగా తయారవుతుంది  అలా అందంగా ఉండాలి అని అభిప్రాయం  తుల అంటే త్రాచు రెండు ప్రక్కల సమానంగా  జీవితంలో ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తూ  సుఖమయ జీవితాన్ని గడపమంటుంది. వృశ్చికం అంటే తేలు అది ప్రతి వాడిని కాటు వేస్తుంది  మనిషి ఎక్కడ చెడు ఉంటే దానిని  ఒక వేటు వేసి  నిర్మూలించాలి అని చెప్పడం కోసం ఆ పేరు  ధనస్సు  రాజులు ఉపయోగించే  యుద్ధ తంత్రం  దానిని సంధించి ఒక బాణాన్ని గురి చూసి  ప్రయోగిస్తే  ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది.అలా జీవిత లక్ష్యాన్ని  ఏర్పరచుకొని  ఆ లక్ష్యాన్ని సాటించడం కోసం జీవితాన్ని  కొనసాగించాలి అన్న అభిప్రాయంతో  ఆ పేరు పెట్టడం జరిగింది.
దాని తర్వాత మకరం అంటే మొసలి. మొసలి నీటిలో ఉండి ఏనుగును కూడా చంపగలిగిన శక్తి సామర్ధ్యాలు కలిగిన జంతువు  మనిషి కూడా తాను ఏదైతే జీవితంలో చేయాలన్నా  ఆలోచన కలిగి ఉంటాడు  దానిని చేయడం కోసం  ఉడుంపట్టులా సాధించాలి అని చెప్పడం కోసం ఏర్పాటు చేశారు  తరువాత కుంభం అంటే కుండ  నిండుగా నీళ్ళు పోసిన కుండలా ఉండాలి జీవితం  అన్ని సమపాళ్లలో ఉండి  మానవుని  అవసరాలు తీర్చడం కోసం ఎలా సహకరిస్తుందో  మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పడం కోసం  చివరిగా మీనం  అంటే చేప  నీటిలో ఉంటూ  నీటిలో తడవకుండా జీవించే ప్రాణి  అలాగే  సమాజంలో జీవిస్తూ సమాజంలో ఉంటూ  సమాజం కాకు అని చెప్పే భగవద్గీత సూత్రాన్ని  అనుసరించి నీవు నీవుగా జీవించడం కోసం  ఏర్పాటుచేసిన పేరు  కనుక ఆధ్యాత్మికంగా ఆ విషయాన్ని అవగాహన చేసుకుని  జీవించిన వ్యక్తి  చిరకాలం పేరు ప్రఖ్యాతులతో గౌరవ మర్యాదలను పొందుతూ ఉంటాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.


కామెంట్‌లు